టీటీడీ టికెట్లు ఇక వాట్సాప్‌లో/TTD tickets now available on WhatsApp

టీటీడీ టికెట్లు ఇక వాట్సాప్‌లో/TTD tickets now available on WhatsApp
thirumal tickest book by whatsup

వాయిస్ ఆఫ్ భారత్, తిరుమల : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సేవలను సులభంగా పొందవచ్చు. ఈ కొత్త సదుపాయం ద్వారా భక్తులు టికెట్ బుకింగ్, ఇతర ముఖ్య సమాచారాన్ని వాట్సాప్‌లోనే చిటికెలో తెలుసుకోవచ్చు.

వాట్సాప్‌లో టీటీడీ సేవలు అందుబాటులో:
వాట్సాప్ ద్వారా ప్రస్తుతం కింది సేవలు, సమాచారం అందుబాటులో ఉన్నాయి. స్లాటెడ్ సర్వదర్శన టోకెన్ సెంటర్ల సమాచారం, టిక్కెట్ల లభ్యత (ఎన్ని టికెట్లు అందుబాటులో ఉన్నాయి), సర్వదర్శనం క్యూలైన్ స్థితి, దర్శనానికి పట్టే సమయం, శ్రీవాణి టిక్కెట్లకు సంబంధించిన సమాచారం, రూమ్స్ డిపాజిట్ రీఫండ్ వివరాలు

వాట్సాప్‌లో టికెట్లు బుక్ చేసుకునే విధానం:

ముందుగా 9552300009 అనే వాట్సాప్ నంబర్‌ను మీ మొబైల్‌లో సేవ్ చేసుకోండి. వాట్సాప్‌ తెరిచి, ఈ నంబర్‌కు “హాయ్” అని మెసేజ్ పంపండి. చాట్‌బాట్ నుంచి వచ్చే ఆప్షన్లలో “ఆలయ బుకింగ్ సేవలు” లేదా మీకు అవసరమైన సేవను ఎంచుకోండి. దర్శన టిక్కెట్లు, సేవా రిజర్వేషన్లు, వసతి లేదా ఇతర సేవలను బుక్ చేసుకోవడానికి చాట్‌బాట్ ఇచ్చే సూచనలను అనుసరించండి. ఈ దశలో మీకు స్లాటెడ్ సర్వదర్శనం, సర్వదర్శనం కౌంటర్ స్టేటస్, శ్రీవాణి కౌంటర్ స్టేటస్, డిపాజిట్ రీఫండ్ లైవ్ స్టేటస్ వంటి ఆప్షన్లు కనిపిస్తాయి. బుకింగ్ పూర్తయిన తర్వాత, దాని వివరాలను మీరు వాట్సాప్‌లో అందుకుంటారు. ఆ వివరాలను డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకోవడం ద్వారా సేవలను వినియోగించుకోవచ్చు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *