పవన్ ‘ఓజీ’ లెక్కలతో ఇండస్ట్రీ షేక్: మొదలైన కలెక్షన్ల ఊచకోత
VoiceofBharath (movie nuews) : పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’ (ఒజాస్ గంభీరా) చిత్రం సెప్టెంబర్ 25న (రేపు) గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలతో ఇండస్ట్రీ షేక్ అవుతోంది. ఓజీకి ప్రపంచవ్యాప్తంగా రూ.172 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది, ఇది పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధికం. ఈ భారీ హైప్ నేపథ్యంలో, బ్రేక్ఈవెన్ సాధించాలంటే ప్రపంచవ్యాప్తంగా రూ.300 నుంచి 310 కోట్ల కలెక్షన్స్ రాబట్టాలని అంచనా వేస్తున్నారు. డే-1 అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో జరగడంతో, తొలిరోజు వసూళ్లు 125-140 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ కావొచ్చని రిపోర్ట్స్ చెబుతున్నాయి. దసరా సీజన్లో సోలోగా వస్తున్న ఈ చిత్రం పాజిటివ్ టాక్ వస్తే బ్రేక్ ఈవెన్ సాధించడం సులువేనని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్గా, ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించారు. ఈ మూవీ కోసం పవన్ కళ్యాణ్ రూ.80 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం.
If you like this content Please Subscibe our Website. for more updates follow our website : https://voiceofbharath.in
#OG
#OGMovie
#OGPreReleaseBusiness
#PawanKalyan
#PawanKalyanOG
#Sujeeth
#ImranHashmi
#PriyankaMohan
#Tollywood
#BoxOffice
#Blockbuster
#BreakEven
#Day1Collections
#OGRelease
#OjasGambheera
#MovieUpdates
#TeluguCinema
