ఓలా మూరత్ మహోత్సవ్’ ఫెస్టివల్ సేల్‌ | Ola Bikes

ఓలా మూరత్ మహోత్సవ్’  ఫెస్టివల్ సేల్‌ | Ola Bikes
VoiceofBhgrath (Business News) : దిగ్గజ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్, పండుగ సీజన్‌ను పురస్కరించుకుని ‘ఓలా మూరత్ మహోత్సవ్’ అనే ఫెస్టివల్ సేల్‌ను ప్రారంభించింది. ఈ తొమ్మిది రోజుల ఆఫర్‌లో భాగంగా, ఓలా ఎస్1 X ఎలక్ట్రిక్ స్కూటర్, రోడ్‌స్టర్ X బైక్‌ను కేవలం రూ. 49,999 ప్రారంభ ధరతో దక్కించుకోవచ్చని సంస్థ ప్రకటించింది.
ఈ తక్కువ ధర ఆఫర్‌లు సెప్టెంబర్ 23 నుంచి నవరాత్రుల్లో కేవలం పరిమిత వాహనాలకు మాత్రమే వర్తిస్తాయి. వినియోగదారులు నిర్దేశిత ‘మూరత్ టైమ్ స్లాట్స్’లో షోరూంలకు ముందుగా వచ్చిన వారికి ముందు ఆఫర్ (ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్ బేసిస్‌లో) పొందుతారు. ఉదాహరణకు, రూ. 81,999 సాధారణ ధర ఉన్న ఎస్1ఎక్స్ 2KWH వేరియంట్‌ను ఆఫర్ కింద రూ. 49,999 కే కొనుగోలు చేయవచ్చు, అంటే దాదాపు రూ. 32 వేల డిస్కౌంట్ లభిస్తుంది. రోడ్‌స్టర్ ఎక్స్, ఎస్1 ప్రో ప్లస్ వంటి ఇతర మోడళ్లపై కూడా గణనీయమైన తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి.

If you like this content  Please Subscibe our Website. for more updates follow our website : https://voiceofbharath.in

#OlaElectric

#OlaMooratMahotsav

#OlaFestivalSale

#OlaS1X

#OlaRoadsterX

#ElectricScooter

#ElectricBike

#EV

#FestiveSeason

#Navratri

#Offers

#Deals

#Discount

#FirstComeFirstServe

#EVIndia

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *