మినీ ట్యాంక్ బండ్ ను అభివృద్ధి చేయాలి/Mini tank bund should be developed
బీజేపీ నాయకుల డిమాండ్
వాయిస్ ఆఫ్ భారత్, కోరుట్ల (సెప్టెంబర్ 18): కోరుట్ల పట్టణంలోని పలు సమస్యలపై భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ నాయకులు గురువారం మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం సమర్పించారు. పట్టణ అధ్యక్షులు బింగి వెంకటేష్ నేతృత్వంలో బీజేపీ నాయకులు ఈ వినతిపత్రాన్ని అందజేశారు. మున్సిపల్ కమిషనర్ కార్యాలయ చాంబర్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలి. మద్దుల చెరువులోని గుర్రపు డెక్క, పిచ్చి మొక్కలను వెంటనే తొలగించి, రాబోయే బతుకమ్మ పండుగ నాటికి మినీ ట్యాంక్ బండ్‌ను శుభ్రం చేయాలి. బతుకమ్మ పండుగను ఆడపడుచులు సజావుగా జరుపుకునేలా ఏర్పాట్లు చేయాలి. మినీ ట్యాంక్ బండ్‌పై భారీ జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేయాలి. పట్టణంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఇందూరు సత్యం, సేవా పక్వాడ్ కోరుట్ల కన్వీనర్ సుదవేని మహేష్, ప్రధాన కార్యదర్శులు చెట్లపెల్లి సాగర్, ఎర్ర రాజేందర్, ఇట్యాల నవీన్, మాజీ కౌన్సిలర్ మాడవెనీ నరేష్, ఉపాధ్యక్షులు చెట్పల్లి ఓం ప్రకాష్, ఉరుమళ్ళ బ్రహ్మం, మైదం సత్యనారాయన, ఉప్పులోటి రాఘవులు, రాదారపు సత్యనారాయణ, గోనె రాజారాం, కిసాన్ మోర్చా అధ్యక్షులు నారాయణరెడ్డి, బీజేవైఎం ఉపాధ్యక్షులు దమ్మ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
