ఫొటో ఎక్స్పో పోస్టర్‌ను ఆవిష్కరణ/Photo Expo poster unveiled

ఫొటో ఎక్స్పో పోస్టర్‌ను ఆవిష్కరణ/Photo Expo poster unveiled
###@@@@Photo Expo poster unveiled@@###

వాయిస్ ఆఫ్ భారత్, పాలకుర్తి: హైదరాబాద్‌లో ఈ నెల 19, 20, 21 తేదీలలో జరగనున్న ఫొటో ఎక్స్పో పోస్టర్‌ను పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. పాలకుర్తి మండల కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల ఫొటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

ఫొటోగ్రఫీ ఒక సృజనాత్మక కళ..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ ఫొటోగ్రఫీ ఒక సృజనాత్మక కళ అని అన్నారు. సామాజిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలను సమాజానికి ప్రతిబింబించేలా చూపించడంలో ఫొటోగ్రాఫర్ల పాత్ర ఎంతో గొప్పదని ఆమె కొనియాడారు. ఈ ఎక్స్పో ద్వారా కొత్త ప్రతిభావంతులు వెలుగులోకి రావడంతో పాటు, ఫొటోగ్రాఫర్లకు ఒక పెద్ద వేదిక లభిస్తుందని పేర్కొన్నారు. ఫొటో యూనియన్ సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించి, ఎక్స్పో విజయవంతం కావడానికి తమవంతు కృషి చేస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *