బాలవికాస సంస్థతో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి భేటీ/MLA Yashaswini Reddy meets with child development organization
వాయిస్ ఆఫ్ భారత్, హనుమకొండ (సెప్టెంబర్ 08): పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి హనుమకొండలోని బాలవికాసా కార్యాలయాన్ని సందర్శించి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శౌరి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని పలు గ్రామాలలో నెలకొన్న తాగునీటి సమస్యలను పరిష్కరించే దిశగా ఈ భేటీ జరిగింది. గ్రామస్థుల ఆరోగ్యం కోసం స్వచ్ఛమైన తాగునీరు అందించాల్సిన ఆవశ్యకతను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వివరించారు. ఈ సమస్యను అధిగమించడానికి బాలవికాసా సంస్థ వాటర్ ప్లాంట్లను మంజూరు చేయాలని ఆమె కోరారు. ఎమ్మెల్యే అభ్యర్థనకు బాలవికాసా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శౌరి రెడ్డి సానుకూలంగా స్పందించారు. అత్యంత త్వరలోనే పాలకుర్తి నియోజకవర్గంలోని గ్రామాలకు వాటర్ ప్లాంట్లను మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పాలకుర్తి ప్రజల అవసరాలు, నియోజకవర్గ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, మరియు గ్రామాల్లో తాగునీటి కొరత నివారణ వంటి అంశాలపై ఇరువురు సవివరంగా చర్చించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ, ప్రజల కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తానని, ప్రతి గ్రామానికి శుద్ధి చేసిన తాగునీరు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.

