7న పద్మశాలి పరపతి సంఘాల సమావేశం
గోడపత్రిక ఆవిష్కరించిన వైద్యం రాజ గోపాల్
వాయిస్ ఆఫ్ భారత్, హనుమకొండ (సెప్టెంబర్ 05): జిల్లా, పట్టణ పద్మశాలి పరపతి సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారుల సమావేశం సెప్టెంబర్ 7, ఆదివారం ఉదయం 9:30 గంటలకు నిర్వహించనున్నట్లు వైద్యం రాజగోపాల్ తెలిపారు. ఈ సమావేశం గురించి తెలియజేస్తూ గురువారం ఒక గోడపత్రికను విడుదల చేశారు. పద్మశాలి పరపతి సంఘాలను ఏకం చేసి, కుల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమన్వయపరచడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ సమావేశంలో సంఘాల ఐక్యత సాధించి, పద్మశాలి సమాజానికి అవసరమైన కమ్యూనిటీ హాళ్లు, మార్కండేయ దేవాలయాలు, శ్మశానవాటికల సౌకర్యాలు కల్పించడం, అలాగే మార్కండేయ జయంతి, కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి, కార్తీక మాస వన భోజనాల వంటి సాంస్కృతిక కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించడంపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ గడ్డం భాస్కర్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు, ప్రముఖ జర్నలిస్ట్ వేముల నాగరాజు, ప్రముఖ జర్నలిస్ట్ గడ్డం కేశవ మూర్తి హాజరవుతున్నారు. ఈ సమావేశంలో ఒక ఎజెండాను రూపొందించి ముందుకు వెళ్లడానికి నిర్ణయించుకుంటారు. ఈ గోడపత్రిక విడుదల కార్యక్రమంలో మార్కండేయ సేవా సంఘం (కేఎల్ రెడ్డి కాలనీ) నుంచి అధ్యక్షులు వైద్యం రాజగోపాల్, కార్యదర్శి గైని సత్యనారాయణ, చక్రపాణి, సుధాకర్; మడికొండ పరపతి సంఘం నుంచి అధ్యక్షుడు కామని మల్లేశం, జాయింట్ సెక్రటరీ ప్రకాష్; శివ మార్కండేయ సంఘం నుంచి సప్త ఋషి సూర్యకిరణ్, కోశాధికారి అశోక్, పద్మనగర్ మార్కండేయ సంఘం నుంచి కార్యదర్శి గజ్జల అమరేందర్, కోశాధికారి బత్తుల సూర్యనారాయణ, కొత్తూరు పద్మశాలి మార్కండేయ సంఘం నుంచి కార్యదర్శి బింగి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

