వీధి కుక్కలు, కోతుల సమస్యపై వినతి
సానుకూలంగా స్పందించిన మున్సిపల్ అధికారులు
వాయిస్ ఆఫ్ భారత్, నర్సంపేట : రాజపల్లె గ్రామంలో వీధి కుక్కలు, కోతుల బెడద తీవ్రంగా ఉందని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామస్థులు మున్సిపల్ కమిషనర్‌ను కలిశారు. గతంలో ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించిన తర్వాత, మంగళవారం గ్రామ పెద్దలు కమిషనర్‌ను కలవగా, ఆయన సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ సానుకూలంగా స్పందించారు. వీధి కుక్కల సమస్యను పరిష్కరించడానికి తన అసిస్టెంట్‌కి డాగ్ స్క్వాడ్‌కు సమాచారం ఇవ్వమని సూచించారు. అదేవిధంగా, కోతుల సమస్యపై కూడా సంబంధిత అధికారులతో చర్చించి త్వరలోనే చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామం నుంచి గూల్ల రాంబాబు, గడ్డం నాగరాజు, పొన్నం చందు, పొన్నం కృష్ణమూర్తి, చొప్పదంటి రఘు, మొహమ్మద్ రఫీ, బూస రాజు, ముత్యం నాగరాజు, గొర్రె అనిల్, పొన్నం సంతోష్, సముద్రాల దేవేందర్, నామాల కిరణ్ కుమార్, నామాల నరేష్, మునుకుంట్ల శరత్, కీసరి శివ, సముద్రాల రాజు పాల్గొన్నారు. గ్రామస్థుల ఐక్యత, కృషి వల్ల ఈ సమస్యపై అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం సాధ్యమైందని, భవిష్యత్తులో కూడా ఇలాగే కలిసికట్టుగా పనిచేయాలని పాల్గొన్నవారు కోరారు. ఈ కార్యక్రమంలో సహకరించిన గ్రామస్థులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

