ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థాన నూతన కమిటీ ప్రమాణ స్వీకారం



హాజరైన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, టీజీ క్యాబ్ చైర్మన్ మార్నెనీ రవీందర్ రావువాయిస్ ఆఫ్ భారత్ ‘ ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థాన నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు,ఎమ్మెల్యేకి, చైర్మన్ కి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందచేయడం జరిగింది. అనంతరం నూతన కమిటీ సభ్యులతో ఆలయ ఈఓ ప్రమాణ స్వీకారం చేయించగా ఆలయ నూతన చైర్మన్ గా ఎన్నికైన కమ్మగోని ప్రభాకర్ గౌడ్ ను, కమిటీ సభ్యులను ఎమ్మెల్యే టీజీ క్యాబ్ చైర్మన్ శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
