రామప్ప కాలేజీలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు/ Ramappa fresher day celebrations

రామప్ప కాలేజీలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు/ Ramappa fresher day celebrations
@@Ramappa fresher day celebrations@@


వాయిస్ ఆఫ్ భారత్, హనుమకొండ : హనుమకొండలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో రామప్ప జూనియర్ కాలేజీ విద్యార్థులు ‘పరిచయ్’ పేరుతో ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు స్వాగతం పలికారని కళాశాల డైరెక్టర్ ఐలీ కర్ణాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల మార్గదర్శకురాలు తేజస్వి మాట్లాడుతూ… విద్యార్థులు తమ సమయాన్ని సద్వినియోగం చేసుకొని, అధ్యాపకులు చెప్పే విషయాలను సరిగ్గా అర్థం చేసుకోవాలని సూచించారు. అకడమిక్ స్కిల్స్‌తో పాటు కాంపిటీటివ్ స్కిల్స్‌ను కూడా మెరుగుపరచుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. కళాశాల డైరెక్టర్ ఐలీ కర్ణాకర్ మాట్లాడుతూ 70 మంది విద్యార్థులతో మొదలైన తమ కళాశాల ఇప్పుడు 1000 మందికి పైగా విద్యార్థులకు వివిధ కోర్సులను అందిస్తూ, వారిని ఉద్యోగులుగా తీర్చిదిద్దడం సంతోషంగా ఉందని తెలిపారు. క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర కృషి ఉంటే విజయం తప్పక సాధిస్తారని, విద్యార్థుల లక్ష్య సాధనకు రామప్ప కాలేజీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జోనల్ మేనేజర్ పూర్ణచందర్ మాట్లాడుతూ గత ఐదేళ్లలో తమ కళాశాల నుంచి 600 మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు సాధించారని తెలిపారు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు, ముగ్గురు ఉద్యోగాలు సాధించిన సందర్భాలు కూడా ఉన్నాయని, ఇది వారి తల్లిదండ్రులకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. విద్యార్థులు కూడా తమ తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకొని ఉన్నతమైన భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా గత సంవత్సరం ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను, రిటైర్డ్ ఆర్మీ రామప్ప కోచ్ కమల్‌ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలు నృత్యాలు, స్కిట్లు, ఆటపాటలు విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపాయి. డైరెక్టర్ ఐలీ కరుణాకర్, తేజస్వి, అకడమిక్ డీన్ వినోద్, వైస్ ప్రిన్సిపాల్ తిరుపతి, ఫిజికల్ డైరెక్టర్ కమల్, జోనల్ మేనేజర్ పూర్ణచందర్ తో పాటు అధ్యాపక, నాన్-టీచింగ్ సిబ్బంది, వెయ్యి మంది విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *