క్రికెటర్‌తో ప్రేమలో తమన్నా?/ Is Tamannaah in love with a cricketer?
మళ్లీ వైరల్‌గా మారిన పాత గాసిప్!
వాయిస్ ఆఫ్ భారత్, సినిమా : దక్షిణాది ప్రేక్షకులకు తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన అందం, అభినయంతో ఎన్నో భాషలలో నటించి ప్రేక్షకులను మెప్పించడంలో ఆమె సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. తెలుగు, తమిళ భాషల్లోనే కాకుండా హిందీ చిత్రాలలో కూడా నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ, తాజాగా వెబ్‌సిరీస్‌ల ద్వారా డిజిటల్ మీడియాలో కూడా తన హవా కొనసాగిస్తోంది. ఇటీవల తమన్నా, నటుడు విజయవర్మతో ప్రేమలో ఉన్నట్టు ప్రకటించి పలువురు అభిమానులకు షాక్ ఇచ్చారు. ఈ జంట పలు ఈవెంట్లలో కలిసి కనిపించి తమ బంధాన్ని నేరుగా వెలుగులోకి తీసుకురావడంతో, ఇది మామూలు గాసిప్ కాదని స్పష్టమైంది. అయితే ఇటీవల వీరి మధ్య విభేదాలు వచ్చాయని, విడిపోయారని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక తమన్నాను చుట్టూ గతంలో వచ్చిన గాసిప్‌లలో ఒకటి తాజాగా మరోసారి ట్రెండ్ అవుతోంది. అదేంటంటే – ఓ సమయంలో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో తమన్నా డేటింగ్ చేశారని వార్తలు గుప్పుమన్నాయి. అయితే వీరిద్దరూ దీనిపై ఎప్పుడూ అధికారికంగా స్పందించలేదు. కొంతకాలం తరువాత విరాట్ అనుష్క శర్మతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ పేరు ఇటీవల సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండటంతో, ఈ పాత గాసిప్ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదుగానీ, తమన్నా పేరు మరోసారి హాట్‌టాపిక్‌గా మారిన సంగతి మాత్రం ఖాయం!
