ఘనంగా ఐరా హాస్పిటల్ ప్రారంభోత్సవం
హాజరైన ఎమ్మెల్యే నాయిని, డీఎంహెచ్ఓ అప్పయ్య
వాయిస్ ఆఫ్ భారత్, హనుమకొండ : నగరంలోని బాలసముద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐరా పిల్లల హాస్పిటల్ ను గురువారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అందరికి అందుబాటులో పిల్లల హాస్పిటల్ ఉండటం గర్వకారణమని, ఈ హాస్పిటల్ లో అన్నిరకాల సదుపాయాలు ఉన్నాయన్నారు. బాలసముద్రంలోని ఏకాశీల పార్క్ పక్కన గల ఈ హాస్పిటల్ లో అనుభవం గల డాక్టర్స్ ఉన్నారని, దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా వైద్యధికారి డా.అప్పయ్య, హాస్పిటల్ డైరెక్టర్స్ డాక్టర్ ఏ.నవీన్, డాక్టర్ నవీన్ రెడ్డి, డాక్టర్ సందీప్, డాక్టర్ డి.సాయిచందర్, డాక్టర్ ఎం.రాజా, డాక్టర్ భరత్ రెడ్డి, డాక్టర్ అరుణ్, డాక్టర్ శ్రావణ్, డాక్టర్ అరవింద్, డాక్టర్ రమేశ్, హాస్పటల్ మేనేజర్, సిబ్బంది పాల్గొన్నారు.
