శ్వేతార్కలో ముగిసిన వసంతోత్సవాలు
ఐదు రోజులు పాటు వైభవంగా ఉత్సవాలు
పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు
వాయిస్ ఆఫ్ భారత్, కాజీపేట : స్వయంభు శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన 27వ వసంతోత్సవాలు సత్యనారాయణ స్వామి వ్రతంతో ముగిశాయి. ఐదు రోజులపాటు విభిన్న ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సాగిన ఉత్సవాల్లో చివరి రోజున శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి శాంతి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వ్రతంలో దేవాలయ పరిపాలన నిర్వహకులు అయినవోలు సాయికృష్ణ శర్మ, కళ్యాణి దంపతులు స్వయంగా పాల్గొని నిర్వహించారు. కార్యక్రమ బ్రహ్మగా కందికోట శ్రీనివాస్ శర్మ బాధ్యతలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ కార్యకర్తలు, భక్తులు భారీగా పాల్గొని పూజా కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. అనంతరం భక్తులందరికీ అన్నపూర్ణ భవన్ లో అన్నదానాన్ని దేవాలయ వ్యవస్థాపక చైర్మన్ అయినవోలు వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు.
