రాజ్యాంగ విలువలను బీజేపీ కాలరాస్తోంది
కాంగ్రెస్ నియోజవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్
వాయిస్ ఆఫ్ భారత్, హుజురాబాద్ : బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ,రాజ్యాంగ విలువలను కాలరాస్తుందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ అన్నారు. గురువారం జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాదీ జమ్మికుంటలో గల 13,14 వార్డులో జై బాపు, జై భీం, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కార్యక్రమాన్ని వీధి, వీధిలా నిర్వహించారు. రాజ్యాంగం అంటే దేశ ప్రజాస్వామ్యానికి పునాది అని, అలాంటి రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం అవమానపరుస్తూ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ ను పార్లమెంట్ సాక్షిగా అవమానపరిచారన్నారు. వెంటనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పి, రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ తీర్మానం చేసినట్లు, బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎస్సీ రిజర్వేషన్ తీర్మానం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జమ్మికుంట మండల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
