ఇంటర్ ఫలితాల్లో సత్తాచాటిన రెజోనెన్స్
వాయిస్ ఆఫ్ భారత్, హనుమకొండ: తెలంగాణ ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో రెజోనెన్స్ జూనియర్ కాలేజీలు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించి తమ ప్రతిభను మరొకసారి నిరూపించుకున్నాయి. ఎంపీసీ, బైపీసీ విభాగాలలో రెజోనెన్స్ విద్యార్థులు మొత్తం 90 రాష్ట్ర స్థాయి ర్యాంకులు దక్కించుకున్నారు. ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో భూక్యా మనోజ్ కుమార్, వేముల అనిక్షిత, గందే వర్ష, మంతిని సహస్ర 468/470 మార్కులతో రాష్ట్ర ప్రథమ ర్యాంకు సాధించారు. మరో 22 మంది విద్యార్థులు 467/470 మార్కులతో రాష్ట్ర ద్వితీయ ర్యాంకు, 21 మంది తృతీయ ర్యాంకు, 25 మంది నాల్గవ ర్యాంకు సాధించడం విశేషం. బైపీసీ విభాగంలో గండ్ర శ్రీజ 438/440,చాపర్తి శ్రీనిధి, దర్ముల శ్రీతిక ఇద్దరూ 436/440 మార్కులతో ర్యాంకులు సాధించారు. ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో నీలం నిక్షిత 995/1000, బుర్ర అక్షిత 994/1000 మార్కులు సాధించి టాప్ ర్యాంకుల్లో నిలిచారు. బైపీసీ విభాగంలో యం. పూజశ్రీ, ఆర్. ఇక్షవర్, డి. త్రిలోచన్, యం. అస్మిత అనే విద్యార్థులు ఒక్కొక్కరూ 992/1000 మార్కులు సాధించారు. ఈ గొప్ప విజయాన్ని పురస్కరించుకుని, రెజోనెన్స్ చైర్మన్ లెక్కల రాజిరెడ్డి రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్ధులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల కృషి, పట్టుదల, ఉపాధ్యాయుల తోడ్పాటు, తల్లిదండ్రుల సహకారం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ అభినందన కార్యక్రమంలో డైరెక్టర్లు లెక్కల మహేందర్ రెడ్డి, మాదిరెడ్డి దేవేందర్ రెడ్డి, సీఏవో లెక్కల రమ్య, అకడమిక్ డీన్ బి.యస్. గోపాలరావు, డీన్ కె. సాంబశివుడు, కళాశాల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.
