డాక్టర్ అక్షితకు నారీ శక్తి అవార్డు
వాయిస్ ఆఫ్ భారత్, హైదరాబాద్ : నాడీ వైద్యంలో విశిష్ట సేవలు అందిస్తూ అమెరికా నుంచి ధన్వంతరి ఆయుర్వేద అవార్డు, అమెరికా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందిన సందర్భంగా హైదరాబాద్ లో శుక్రవారం స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఎన్జీవో వారు డాక్టర్ అక్షితకు భారత నారీ శక్తి ఇంటర్నేషనల్ అవార్డును ప్రధానం చేశారు. నాడీ వైద్యరంగంలో కరీంనగర్, బెంగుళూర్, హైదరాబాద్ లో డాక్టర్ అక్షిత చేస్తున్న ఉచిత వైద్య సేవలను గుర్తించిన స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఎన్జీవో ఈ అవార్డును ఆమె సేవలకు గుర్తింపుగా అందజేశారు. సిరిసిల్లకు చెందిన డాక్టర్ అక్షిత పద్శశాలి కులంలో పుట్టి తన ప్రతిభతో దేశ, విదేశాలో, వివిధ రాష్ట్రాలో గుర్తింపును పొందింది. ఇప్పటికే నాడీ వైద్యంలో తెలంగాణ నుంచి ఉత్తమ డాక్టర్ గా గుర్తింపు పొందిన ఆమెను మన పద్శశాలీ కులబాంధవులు, పెద్దలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అభినందిస్తూ మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
