ఘనంగా నాయుడు గారి కుండ బిర్యాని రెస్టారెంట్ ప్రారంభం
హాజరైన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాయిని
వాయిస్ ఆఫ్ భారత్, హనుమకొండ : సుబేదారిలోని నాయుడు గారి కుండ బిర్యాని రెస్టారెంట్ 36వ బ్రాంచ్ ను శుక్రవారం వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిధిలుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ నిర్వాహకులను ఎంపీ, ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఎంపీ డా.కడియం కావ్య మీడియాతో మాట్లాడుతూ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించినప్పుడే అందరి మన్ననలు పొందవచ్చునని అన్నారు. ప్రజలు తమ దైనందిన జీవితంలో భాగంగా వారంలో ఒకసారైనా కుటుంబంతో కలిసి రెస్టారెంట్ కు వస్తారని, వారిని దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన, రుచికరమైన భోజన సేవలు కల్పించాలన్నారు. అలాగే రెస్టారెంట్ వ్యాపారం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 60వ డివిజన్ కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్, యూత్ కాంగ్రెస్ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు కేఆర్ దిలీప్ రాజ్, సత్య సాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వేముల రంజిత్ తదితరులు పాల్గొన్నారు.


