ఘనంగా సన్ రైస్ హాస్పిటల్ ప్రారంభోత్సవం
హాజరైన ఎమ్మెల్యేలు నాయిని, జీఎస్సాఆర్
వాయిస్ ఆఫ్ భారత్, హనుమకొండ : జిల్లా కేంద్రంలో సన్ రైస్ హాస్పిటల్ ప్రారంభోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, భూపాలపల్లి శాసనసభ్యుడు గండ్ర సత్యనారాయణ రావులు ముఖ్య అతిథులుగా హాజరై హస్పిటల్ ను ప్రారంభించారు. సన్ రైస్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ రాకేష్ రెడ్డి మాట్లాడుతూ వరంగల్ జిల్లాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సేవలు సామాన్య ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా సేవలు అందిస్తున్నామని తెలిపారు. అలాగే 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.
