HERO NAGESHWAR RAO /ఆ హీరోను దత్తత తీసుకున్న ఏఎన్నాఆర్‌?

వాయిస్ ఆఫ్ భారత్, సినిమా : అక్కినేని ఫ్యామిలీకి టాలీవుడ్‌ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. టాలీవుడ్‌ను చెన్నై నుంచి హైదరాబాద్‌కు మార్చడంలో అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్‌ఆర్‌) కీలక పాత్ర పోషించారు. ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌ టాలీవుడ్‌కి రెండు కళ్లుగా భావించబడతారు. ఇటీవల, అక్కినేని నాగేశ్వరరావు దత్తత తీసుకున్న హీరో గురించి ఒక సంచలన విషయం బయటకు వచ్చింది. ప్రముఖ షో శ్రీదేవి డ్రామా కంపెనీలో, హీరో సుమంత్ ఈ విషయాన్ని వెల్లడించారు. సుమంత్‌ అక్కినేని నాగేశ్వరరావు పెద్ద కూతురు సత్యవతి & యార్లగడ్డ సురేంద్రల కుమారుడు. అయితే, అక్కినేని నాగేశ్వరరావు ఆయనను అధికారికంగా దత్తత తీసుకున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో, ఫాదర్స్ గురించి చర్చ జరిగినప్పుడు, సుమంత్‌ మాట్లాడుతూ – “నాకు ఇద్దరు తండ్రులు ఉన్నారు. నా జన్మతండ్రి యార్లగడ్డ సురేంద్ర కాగా, అక్కినేని నాగేశ్వరరావు నన్ను దత్తత తీసుకున్నారు. ప్రాక్టికల్‌గా అయితే ఆయనే నా తండ్రి” అని వెల్లడించారు. ఈ ప్రకటన విని ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురయ్యారు. సుమంత్‌ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రేమకథ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన, యువకుడు, సత్యం, గౌరీ, గోదావరి, మధుమాసం, గోల్కొండ హైస్కూల్‌, మళ్లీ రావా వంటి హిట్‌ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ పాత్రల్లో నటిస్తూ కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. అయితే, ఈ వార్తపై పూర్తి క్లారిటీ రావాలంటే ఫుల్‌ ఎపిసోడ్‌ ప్రసారం అయ్యే వరకు వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *