NIDHI LOVE STORY/స్టార్ హీరో ప్రేమలో పడ్డ నిధి అగర్వాల్
వాయిస్ ఆఫ్ భారత్, సినిమా న్యూస్ : సినిమా ఇండస్ట్రీలో ప్రేమాయణాలు, పెళ్లిల్లు, విడాకులు లాంటి విషయాలు ఎప్పటికప్పుడూ హాట్ టాపిక్‌గా మారుతూనే ఉంటాయి. ఇటీవలి కాలంలో చాలా మంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకొని కొత్త జీవితం మొదలుపెడుతుంటే, కొంతమంది వారి ప్రేమాయణాలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఓ క్రేజీ బ్యూటీ గురించి వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.
నిధి అగర్వాల్ ప్రేమలో పడిందా?
టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న గ్లామరస్ హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రేమలో పడినట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. కెరీర్ ప్రారంభంలో పెద్దగా అవకాశాలు రాకపోయినా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ హిట్‌తో మరింత పాపులర్ అయ్యింది. ప్రస్తుతం ఆమె పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహరవీరమల్లు, అలాగే ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తున్న రాజా సాబ్ చిత్రాల్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే, గతంలో నిధి అగర్వాల్ తమిళ్ స్టార్ హీరో శింబుతో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అప్పట్లో ఆమె ఆ రూమర్స్‌ను ఖండించినా, ఇప్పుడు మరోసారి వీరి మధ్య ప్రేమ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. తాజా సమాచారం ప్రకారం, నిధి అగర్వాల్ ఇటీవల చెన్నైలోని టి నగర్ ప్రాంతంలో శింబు ఇంటికి సమీపంగా మకాం మార్చిందట. ప్రస్తుతం వీరు కుటుంబ సభ్యులను ఒప్పించే పనిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
శింబుతో పెళ్లి – కెరీర్ ఎండ్?
శింబు గతంలో కూడా పలు హీరోయిన్‌లతో లవ్ ఎఫైర్స్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు నిధి అగర్వాల్‌తో పెళ్లి చేసే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, పెళ్లి చేసుకుంటే నిధి కెరీర్ ముగిసిపోతుందేమోనని కొందరు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి, ఈ ప్రేమ కథ నిజంగా పెళ్లికి దారి తీస్తుందా? లేదా ఇదీ కేవలం గుసగుసలుగానే మిగిలిపోతుందా? అనేది చూడాలి.
