CHIKEN GUNYA/చికెన్ గున్యా వ్యాధి నివారణలో వ్యూహాత్మక ఒప్పందం
చికెన్‌గున్యాకు వ్యాక్సిన్
తయారీకి బయోలాజికల్-ఈఫార్మా బవేరియన్ నార్డిక్ కంపెనీతో ఒప్పందం
వాయిస్ ఆఫ్ భారత్, హైదరాబాద్ : చికెన్ గున్యా వ్యాధి నివారణ కోసం, హైదరాబాద్ ఆధారిత బయోలాజికల్-ఈ సంస్థ, బవేరియన్ నార్డిక్ కంపెనీతో ఒక వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశ్యం–పేద, మధ్య తరగతి ఆదాయం కలిగిన దేశాలకు చికెన్ గున్యా వ్యాక్సిన్‌ను అందించడం. ఈ ఒప్పందంలో మొదటిగా టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ జరగడానికి నిర్ణయించబడింది. ఆపై, కంపెనీ రెగ్యులేటరీ ఆమోదం కోసం ప్రయత్నించి, కమర్షియల్ ఉత్పత్తి దిశగా అడుగు వేస్తుంది. దిగువ, మధ్య ఆదాయ దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేయాలనే లక్ష్యంతో రెండు ఫార్మాస్యూటికల్ సంస్థలు ఈ డీల్‌లో భాగస్వామ్యంగా ఉన్నట్లు కంపెనీ పత్రికా ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలోని ఉత్పత్తి కేంద్రంలోనే ఈ వ్యాక్సిన్ తయారీ జరగనున్నది. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 300 కొత్త ఉద్యోగాలు సృష్టించబడనుంది. ప్రపంచ వ్యాప్తంగా చికెన్ గున్యా వ్యాధిని నియంత్రించేందుకు ప్రణాళికను చేపట్టిన ఈ ప్రాజెక్టు, అమెరికాలో ఇప్పటికే ఆమోదం పొందిన నమూనా ఆధారంగా రూపొందించబడుతున్నది – అక్కడ 12 ఏళ్లకు పై వయస్సు గల పిల్లలకు కూడా ఈ వ్యాక్సిన్ అందజేయబడుతోంది. బవేరియన్ నార్డిక్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడంపై సంతోషాన్ని వ్యక్తపరుస్తూ, బయోలాజికల్-ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మహిమ ధాట్ల అన్నారు, “మా ఆధునాతన ఉత్పత్తి టెక్నాలజీతో పేద మరియు మధ్య తరగతి దేశాలకు వ్యాక్సిన్‌ను అందించే మా లక్ష్యం, ప్రపంచవ్యాప్తంగా చికెన్ గున్యా వ్యాధిని నియంత్రించడంలో మరియు ప్రజా ఆరోగ్య వ్యవస్థను బలపర్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది.” ఇటకు, బవేరియన్ నార్డిక్ సీఈవో పాల్ చాప్లిన్ కూడా, “గ్లోబల్ యాక్సెస్ సాధించేందుకు BEతో ఒప్పందం కుదుర్చుకున్నందుకు సంతోషంగా ఉన్నాము,” అన్నారు. వారిచెప్పిన విధంగా, ఈ వ్యాక్సిన్‌ను ‘చిక్ WLPP’ పేరుతో అభివృద్ధి చేయడం జరుగుతోంది. దీన్ని VLP రికాంబినంట్ ప్రోటీన్ వ్యాక్సిన్‌గా పిలుస్తారు, ఇది చికెన్ గున్యా వైరస్‌ను నియంత్రించేందుకు రూపొందించబడింది. 12 ఏళ్లకు పై వయస్సు గల వారికి ఈ వ్యాక్సిన్‌ను అందజేయనున్నారని పేర్కొన్నారు.
