FAKE CURENCY/రైతు పొలంలో నోట్ల కట్టలు
నకిలీ నోట్లని తెలిసి షాక్
వాయిస్ ఆఫ్ భారత్, నల్లగొండ : నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం పొత్తలపాలెం వద్ద ఓ రైతుకు చేదు అనుభవం ఎదురైంది. మంగళవారం ఉదయం తన పొలానికి వెళ్లిన రైతు అక్కడ రూ.500 నోట్ల కట్టలతో కూడిన సంచిని గమనించాడు. మొదట అసలు నోట్లుగా భావించిన ఆయన మరో రైతుతో కలిసి పరిశీలించగా అవి నకిలీ నోట్లు అని తేలింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నోట్లపై ‘చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ అని ముద్రించబడిందని పోలీసులు తెలిపారు. నోట్లను ఎవరు పడేశారు? ఏమి ఉద్దేశ్యంతో ఉంచారు? అనే కోణంలో విచారణ జరుపుతున్నట్టు అధికారులు వెల్లడించారు.
