ORVASI-PRASHANTH NEEL/ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఊర్వశీ రౌతేలా
జానియర్ ఎన్టీఆర్ సరసన ప్రత్యేక పాత్రలో..
వాయిస్ ఆఫ్ భారత్, సినిమా : గత కొన్ని రోజులుగా బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా పేరుTollywood మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. 2023లో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన ఆమె ‘వాల్తేర్ వీరయ్య’, ‘ఏజెంట్’, ‘బ్రో’, ‘స్కంద’ చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. అయితే, ఆమె ప్రధాన పాత్రలో నటించిన ద్విభాషా చిత్రం ‘బ్లాక్ రోజ్’ (తెలుగు, హిందీ) ఇంకా విడుదల కాలేదు.
ఇటీవల బాలకృష్ణతో కలిసి ‘డాకు మహరాజ్’ చిత్రంలో నటించిన ఊర్వశీ, అందులో చేసిన డాన్స్ మూమెంట్స్ వల్ల ఎంతోమంది దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాలో బాలకృష్ణతో కలిసి ఆమె వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అటు పాజిటివ్‌గా, ఇటు నెగటివ్‌గా ట్రెండింగ్‌లో నిలిచాయి. ఇదే సమయంలో ‘డాకు మహరాజ్’ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కాగానే, ఊర్వశీ సన్నివేశాలను తొలగించారని వచ్చిన వార్తలు హల్‌చల్ చేశాయి. అయితే, అలాంటి ప్రచారంలో నిజం లేదని తేలింది. సినిమాను ఓటీటీలో ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు.
ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు..
ఇప్పుడు ఊర్వశీ రౌతేలా, ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో కీలక పాత్ర పోషించబోతోందనే వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లు సమాచారం. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓల్డ్ కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ పీరియాడిక్ యాక్షన్ మాస్ మూవీలో ఎన్టీఆర్ సరసన రుక్మిణీ వసంత్ కథానాయికగా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, వచ్చే ఏడాది జనవరి 9న విడుదల చేయనున్నట్లు సమాచారం. మరో విశేషం ఏమిటంటే, ‘వాల్తేర్ వీరయ్య’, ‘డాకు మహరాజ్’ తర్వాత ఊర్వశీ రౌతేలా నటిస్తున్న మరో సంక్రాంతి రిలీజ్ మూవీ ఇదే అవుతుంది.
