Indian national anthem in Pakistan /పాకిస్థాన్‌లో భారత జాతీయ గీతం
వాయిస్ ఆఫ్ భారత్, ప్రత్యేక ప్రతినిధి : ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో మరో ఆసక్తికర పోరకు వేదిక సిద్ధమైంది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్లో అగ్రశ్రేణి జట్లు ఆస్ట్రేలియా – ఇంగ్లాండ్ హోరాహోరీగా తలపడుతున్నాయి. లాహోర్‌లోని గదాఫీ స్టేడియం ఈ కీలక మ్యాచ్‌కు వేదికగా మారింది. గెలిచి ముందడుగు వేయాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. అయితే, టాస్ సమయంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా ఆట ప్రారంభానికి ముందు, మైదానంలో ఉన్న ఆటగాళ్లు తమ దేశ జాతీయ గీతాన్ని ఆలపించడం సంప్రదాయం. బ్యాక్‌గ్రౌండ్‌లో ఆయా దేశాల జాతీయ గీతాలు ప్లే చేస్తారు. కానీ, ఈ మ్యాచ్‌లో భారత జాతీయ గీతాన్ని పొరపాటున ప్లే చేశారు. మొదట ఇంగ్లాండ్ జాతీయ గీతాన్ని ప్లే చేసిన నిర్వాహకులు, ఆ తర్వాత పొరపాటుగా భారత జాతీయ గీతాన్ని ప్లే చేశారు. అయితే, వెంటనే ఇది గమనించిన వారు ఆస్ట్రేలియా జాతీయ గీతాన్ని ప్లే చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు “పాక్ గడ్డపై భారత జాతీయ గీతం” అంటూ ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.
మ్యాచ్ విశేషాలు..
టాస్‌లో గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బౌలింగ్ ఎంచుకుంది, దీంతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేపట్టింది. 11 ఓవర్ల ముగిసే సరికి ఇంగ్లాండ్ 2 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది.
ఆస్ట్రేలియా తుది జట్టు:
- మ్యాథ్యూ షార్ట్
- ట్రావిస్ హెడ్
- స్టీవ్ స్మిత్ (కెప్టెన్)
- మార్నస్ లబుషేన్
- జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్)
- అలెక్స్ కేరీ
- గ్లెన్ మాక్స్వెల్
- బెన్ డ్వారిషూస్
- నాథన్ ఎల్లిస్
- ఆడమ్ జంపా
- స్పెన్సర్ జాన్సన్
ఇంగ్లాండ్ తుది జట్టు:
- ఫిలిప్ సాల్ట్
- బెన్ డకెట్
- జేమీ స్మిత్ (వికెట్ కీపర్)
- జో రూట్
- హ్యారీ బ్రూక్
- జోస్ బట్లర్ (కెప్టెన్)
- లియామ్ లివింగ్‌స్టోన్
- బ్రైడన్ కార్స్
- జోఫ్రా ఆర్చర్
- అదిల్ రషీద్
- మార్క్ వుడ్
