వైన్ షాపుల సిండికేట్ అరికట్టాలి

వైన్ షాపుల సిండికేట్ అరికట్టాలి
Wine shop syndicates must be stopped

బెల్ట్ షాపులను మూసివేయాలని వినతి
వాయిస్ ఆఫ్ భారత్, రేగొండ : మండల కేంద్రంలోని వైన్ షాపుల నిర్వాహకుల సిండికేట్ అరికట్టాలని, అధిక ధరలకు మద్యాన్ని అమ్ముతున్న వైన్ షాపులపై చర్యలు తీసుకోవాలని, గ్రామాల్లో బెల్ట్ షాపులను మూసేయాలని కోరుతూ డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో రేగొండ మండల తహసీల్దార్ శ్వేతకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.తిరుపతి మాట్లాడారు. విచ్చలవిడిగా బెల్ట్ షాపుల నిర్వహణ జరుగుతూ మద్యాన్ని అధిక రేట్లకు అమ్ముతూ దోచుకుంటున్న, వైన్స్ షాపులు, బెల్టు షాపులపై చర్యలు తీసుకొని వాటిని మూసివేయాలన్నారు. నిబంధనలు పాటించని వైన్ షాప్ పై చర్యలు తీసుకోవాలని, వైన్ షాపు నిర్వాహకులు సిండికేట్ గా ఏర్పడి అక్రమ దందా చేస్తున్నారని, బెల్టు షాపులను ప్రోత్సహిస్తూ అధిక ధరలకు మద్యాన్ని అమ్ముతూ దోచుకుంటున్నారని మండిపడ్డారు. వైన్స్ షాపుల్లో కొన్ని బ్రాండ్లకు కృత్రిమ కొరతను సృష్టిస్తూ, బెల్ట్ షాపులకు సప్లై చేస్తున్నారు. వైన్ షాపులో యజమానులు అధిక ధరలకు బెల్టు షాపులకు మద్యం సరఫరా చేయడం, బెల్టు షాపుల నిర్వాహకులు వాటిపై రేట్లు పెంచి అమ్మడం జరుగుతున్న ఎక్సైజ్ అధికారులు పట్టించుకోకపోవడంలో అనేక అనుమానాలకు తావిస్తుందన్నారు. అధికారులు నిర్లక్ష్యం వల్లే బెల్ట్ షాపులు వైన్ షాపులు యజమానులు రెచ్చిపోయి ఇష్టానుసారంగా మద్యం వ్యాపారం చేస్తున్నారని తెలిపారు. గతంలో అనేకసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా మద్యం పేరుతో దందా చేస్తున్న వైన్ షాపులపై చర్యలు తీసుకొని, బెల్టు షాపులను రద్దు చేయాలని తిరుపతి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా నాయకులు మాటూరి సతీష్, మండల కన్వీనర్ బోగిరి నితిన్, పసుల బన్నీ, నవీన్, రాకేష్, అజయ్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *