పిజియన్ కంపెనీ అవుట్ లెట్ ప్రారంభం
వాయిస్ ఆఫ్ భారత్, హనుమకొండ : నయీంనగర్ వాగ్దేవి విద్యాసంస్థల ఎదురుగా మెయిన్ రోడ్డులో నిర్వాహకులు నల్లవెల్లి మధుకర్ రెడ్డి-మాధవి దంపతులు నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ మహాలక్ష్మి ఎంటర్ ప్రైజెస్ పిజియన్ కంపెనీ అవులేట్ షాపును శుక్రవారం ఏపీజీవీబీ వరంగల్ బ్రాంచ్ రీజినల్ మేనేజర్ జీపీఎస్ చైతన్య కుమార్ ముఖ్యఅతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మధుకర్ రెడ్డి మాట్లాడుతూ వరంగల్ మహానగరంలో సామాన్య ప్రజలకు అందుబాటు ధరలో నాణ్యమైన గృహోపకరణ పీజియన్ కంపెనీ వస్తువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రవీందర్, సూరంరాజు, రాజు నాయక్, ఏపీజీవీబీ ఉద్యోగులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.
