రైతులకు సమగ్ర సస్య రక్షణ కిట్లు
వాయిస్ ఆఫ్ భారత్, దామెర : మండలంలని పులుకుర్తి గ్రామంలో కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో రైతు క్షేత్ర పాఠశాలలో భాగంగా రైతులకు సమగ్ర సస్య రక్షణ కిట్లు (IPM)అందించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ హోన్నప్ప గౌడ పర్యవేక్షణలో గత మూడు నెలల నుంచి క్షేత్రస్థాయిలో పత్తి పంట నాటినప్పటి నుంచిపంట చేతికి వచ్చు వరకు పాటించవలసిన అన్ని సస్య రక్షణ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ వెంకట రెడ్డి మాట్లాడుతూ పురుగుమందులు వాడే తప్పుడు పాటించవలసిన జాగ్రత్తల గురించి చాలా విషయాలు చెప్పి IPM కిట్ ఉపయోగాలు వివరించారు. అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉదయ్ శంకర్ రైతులకు పురుగు గుడ్లపై వేప నూనె పిచి కారి, రెక్కల పురుగుపై నిఘా పెట్టటానికి లింగాకర్షక బుట్టలు, ట్రైకోగ్రామా గుడ్డు పరాన్న జీవి ఉపయోగం గురించి వివరించారు. వ్యవసాయ సహాయ సంచాలకులు మాట్లాడుతూ సమగ్ర సస్యరక్షణ అంటేనే తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించాలనేది ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశమని రైతులకు వివరించారు. లింగాకర్షక బుట్టలు, జిగురు ఆట్టలు, గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సమగ్ర సస్యరక్షణ కేంద్రం, హైదరాబాద్ అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ బసవన్నప్ప, వ్యవసాయ అధికారి రాకేష్, వ్యవసాయ విస్తరణ అధికారి రామకృష్ణ, రైతు సంఘం అధ్యక్షులు కె.లక్ష్మణ్, వేణుగోపాల్, రాంబాబు, గ్రామ రైతు సోదరులు పాల్గొన్నారు.
