కాకతీయ శిల్పకళా వైభవానికి నిలువెత్తు సాక్షంగా నిలిచిన శ్రీ పాంచాలరాయ (కృష్ణ) స్వామి దేవాలయం వరంగల్లో ఒక ముఖ్యమైన చారిత్రక కట్టడం. కాకతీయుల నిర్మాణ కళా వైభవానికి ఈ ఆలయం ఒక దృఢ సాక్ష్యం. ఇది కాకతీయుల కాలంలో నిర్మించబడిన వైష్ణవ దేవాలయాల్లో ఒకటి, జైన మరియు శైవ దేవాలయాల ప్రాముఖ్యత ఉన్నప్పటికీ, ఈ ఆలయం శ్రీకృష్ణుడిని పాంచాలరాయుడిగా పూజించే ప్రత్యేకతను కలిగి ఉంది.
ఆలయనికి మార్గం
ఈ ఆలయం వరంగల్లుకు 18 కి.మీ. దూరంలో గీసుగొండ మండలంలోని శాయంపేట (హవేలి) గ్రామంలో ఉంది. ఈ ఆలయానికి రవాణా సౌకర్యాలు నర్సంపేట రోడ్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. రైల్వే చింతలపల్లి స్టేషన్ సమీపంలో ఈ ఆలయం ఉంది. కాకతీయ రాజధాని వరంగల్ సమీపంలో ఉన్న ఈ దేవాలయం ఒకప్పుడు అత్యంత వైభవంగా ఉండేది.
కాకతీయుల నిర్మాణకళా వైభవం
కాకతీయులు దేవాలయ నిర్మాణంలో ప్రత్యేక శైలిని అవలంబించారు. వారి కట్టడాలు, ముఖ్యంగా దేవాలయాలు, దుర్గాలు అనేక ప్రత్యేక శిల్ప వైభవంతో నిర్మించబడ్డాయి. కాకతీయుల నిర్మాణాల్లో “ఏకకూట”, “త్రికూట” మరియు “పంచకూట” వంటి నిర్మాణ శైలులు ప్రసిద్ధి చెందాయి. నక్షత్రాకార విమానాలు కాకతీయ దేవాలయాల ప్రత్యేకతగా నిలుస్తాయి.
ధార్మిక మరియు సాంస్కృతిక పరిణామం
ప్రారంభంలో కాకతీయ రాజులు జైనమతం అనుసరించారు, కానీ తరువాత వారు శైవమతాన్ని స్వీకరించారు. ఈ పరిణామం వారి నిర్మాణాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. కాకతీయుల దేవాలయాలలో శైవమత సంబంధిత గోళికీ ముఠాలు, సత్రాలు ఎక్కువగా కనబడతాయి. అయితే, ప్రజలలో వైష్ణవ మతం కూడా వ్యాప్తిలో ఉండేది.
వైష్ణవం ప్రాముఖ్యం
కాకతీయుల కాలంలో ప్రజలలో వైష్ణవ మతం కూడా ప్రాచుర్యంలోకి వచ్చింది. శ్రీకృష్ణుడు “పాంచాలరాయుడు”గా పూజలు అందుకునే ఈ ఆలయం, భారతదేశంలో చాలా అరుదైన ఆలయాలలో ఒకటిగా నిలిచింది. కృష్ణుడిని పాంచాలరాయుడిగా పూజించడం వరంగల్లులోని ఈ దేవాలయంలో మాత్రమే కనిపిస్తుంది.
ప్రసిద్ధ కాకతీయ ఆలయాలు
వరంగల్, అనుమకొండ, పిల్లలమఱ్ఱి, పాలంపేట, గణపురం, మాచర్ల వంటి ప్రాంతాలలో కాకతీయులు నిర్మించిన ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. వీటిలో వేయి స్తంభాల గుడి, సిద్దేశ్వర ఆలయం, పద్మాక్షి దేవాలయం ముఖ్యమైనవి. పాంచాలరాయ స్వామి దేవాలయం కూడా కాకతీయుల నిర్మాణ కళకు ఒక ముఖ్యమైన కట్టడంగా నిలిచింది.
ఆలయ నిర్మాణ శైలి మరియు ప్రత్యేకతలు
ఈ ఆలయం శిథిల స్థితిలో ఉన్నప్పటికీ, కాకతీయ శైలిలో నిర్మితమైన స్తంభాలు, కళ్యాణ మండపాలు, మరియు గర్భగృహం విశిష్టంగా నిలిచాయి. ఆలయంలోని స్తంభాలపై చెక్కబడ్డ హంసలు, లతలు కాకతీయుల శిల్ప కళకు నిదర్శనం. గర్భగృహంలోని శ్రీకృష్ణుడి విగ్రహం అత్యంత సున్నితంగా చెక్కబడి, నున్నగా మెరుగు పెట్టబడి ఉంది. ఈ విగ్రహం కేశవమూర్తి విభవంగా పూజించబడుతుంది.

పాంచాలరాయ స్వామి ఆలయ చరిత్ర
ఈ దేవాలయం ప్రాచీన కాలంలో కాకతీయుల అధికారం క్రింద నిర్మించబడినప్పటికీ, తరువాతి కాలంలో ముస్లింల దండయాత్రల కారణంగా శిథిలమైంది. షితాబుఖాను అనే ముస్లిం అధికారిపైన కోటను తిరిగి జయించినప్పుడు, ఆలయాన్ని పునరుద్ధరించినట్లు చరిత్రకారులు పేర్కొన్నారు. క్రీ.శ.1504లో పంచకూట దేవాలయంగా పునరుద్ధరించబడిన ఈ ఆలయం, కాకతీయుల వైభవాన్ని ప్రతిబింబిస్తుంది.
ఈ దేవాలయం ప్రాచీన కాలంలో అత్యంత వైభవోపేతంగా ఉండేదనటానికి అనేక ఆధారాలున్నాయి. సర్వప్ప రచించిన సిద్దేశ్వర చరిత్రలో పాలంచాలరాయని ప్రసక్తి కనిపిస్తుంది. బేతరాజు ఆ మూర్తికి అనుమకొండ తూర్పూ ముఖాన దేవాలయం కట్టించినట్లుగాను వృత్తాంతీకరించి నాడు శాయంపేట (హవేలి) గ్రామం అనుమకొండకు తూర్పు వైపునే ఉంది. ఇక మరొక ఆధారం షితఫతి రాజు (షితాబుఖాను) శాసనం ముస్లింలనుండి ఓరుగల్లు కోటను జయించిన సందర్భంగా షితాబుఖాను క్రీ.శ.1504లో వేయించిన శాసనంలో అన్య మతస్థులు చేసినవి ధ్వంసంకాండలో వైభవాన్ని కోల్పోయి పాంచారయని పునరద్దరించినట్లుగా పేర్కొన్నారు.
ఈ శాసనకర్త అన్నార్యుని కుమారుడు నామధేయుడు ఈ శాసనంలో
‘పాంచాల్వై పరిభూత ధైన్య బహుళ ప్రోద్భత్కృ పావేశత
ప్రానాదక్షయ వస్త్ర జాత మమలం యోగోపి కావల్లభః
తంస్థానాచ్చలితం దురీతి విభవాత్సల చాలరాయపున
ర్ఛోగే చిత్తాపఖాన భూమి రమణః సిహాసనేస్థాపయత్’’
‘‘దుష్టులచే పరిభవింపబడి దైన్యము పొందిన పాంచాలికి కృష్ణామయుడైన గోపికా వల్లభుడు అఓయ వస్త్ర పరంపర నొసంగినాడు. దష్టులచే స్థానచలనం పొందిన అట్టి పాంచాల రాయుని చిత్తసభినుడు మరల సింహాసనాధిష్టతుని చేసి పునర్వైభవాన్ని కలిగించినాడు అని పేర్కొన్నారు. చరిత్రకాధారాల ప్రకారం తురుష్క దండయాత్రల వల్ల ఆలయం ధ్వంసమైపోగా షితాబుఖాను దీనిని పునరుద్దరించి ఉండవచ్చునని మనం ఊహించవచ్చు. ఈ షితాబుఖాను వద్ద మంత్రిగా ఉండిన ఎనములపల్లి పెద్దనామాత్యునికి అంకితమీయబడ్డ చరిగొండ ధర్మాన్న వ్రాసిన చిత్ర భరతంలో కూడా పాంచాల రాయని ప్రసక్తి ఉన్నది.
ధర్మన్న తన కఈతిభర్త పెద్దనామాత్యుని తమ్ముడైన అమాత్యడు.
‘‘నిశ్చలభక్తి నివలసిల్ల మఱి పాంచాలీశ్వ ప్రాంగణ
స్థలి గట్టించె సువర్ణకుంభ విలసత్యాధంబు నోర్గంటిలోన్’’ అని వ్రాసినాడు.
ఓరుగంటిలోని పాంచాలీశ్వర దేవాలయ ప్రాంగణంలో తిమ్మామాత్యుడు సువర్ణ కుంభలెత్తబడిన భవనాన్ని కట్టించినాడట. అయితే నేడవేవీ మనకు కనిపించవు. పాంచాలి మాన సంరక్షణ చేసిన శ్రీకృష్ణుడు పాంచాల రాయడుగా ప్రసిద్ధుడైనాడు. అయితే శ్రీకృష్ణుడు ‘‘పాంచాలరాయడు’’గా పూజలందుకోవడం వరంగల్లులోని ఈ దేవాలయంలో తప్ప భారతదేశంలో మరే ప్రాంతంలో ఉన్నట్లుతోచదు. ఇక ఆలయ ప్రస్తుత స్థితిగతులకు వస్తే ఆలయం చాలా భాగం శిథిలమై పోయింది ప్రాంగణానికి నైఋతి మూలన శిథిల స్థిలో ఉన్న కాకతీయ స్తంభాలు కల కళ్యాణ మంటపం వాయువ్య మూలన ఆళ్వార్ల మంటపమూఉన్నాయి. ఈశాన్య మూలన క్రొత్తగా నిర్మించిన కళ్యాణ మంటపం ఉంది. ప్రాకారం బయట దక్షిణ ముఖంగా ఉంది. మొత్తం ఆలయం గర్భ గృహం అంతరాళం చుట్టూ ఆలయంలోపలే (ఆలయం గోడ గర్భగృహం అంతరాళం గోడల మధ్య) ప్రదక్షిణ పధం ఉంది. కాని ప్రస్తుతం రాతిపలకల చేత మూసి వేయబడింది. బహుశ తరువాతి కాలంలో ప్రదక్షిణ పథం మూసివేసి టారు. ఆలయం బయట గోడరాళ్ళ భాగాన నలు చదరాన్ని ఏర్పరుస్తూ నాలుగు కాకతీయ శైలీ స్తంభాలు ఉన్నాయి. ఛతురస్రాకారపు దిమ్మె వంటి క్రింది భఆగమూ పలకల ముఖాలా చతురస్ర భాగాలు కల మధ్య భాగమూ కల సామాన్యమైన కాకతీయ శైలి స్తంభాలు ఇవి అయితే స్తంభాలు నున్నగా సానబట్టబడి ఉన్నాయి. ఆలయంలో స్తంభాల పైన చెక్కబడ్డ హంసల వరుసలు, లతలూ తప్ప పెద్దగా శిల్ప విశేషాలు లేవు.

గర్భగృహంపైన ఉన్న శిఖర తరువాతి కాలానికి చెందిన పిరమిడ్ ఆకారపు శిఖఱం. శిఖరంపైన ఉన్న చతురస్రాకారపు దిమ్మెపై ఆయుధం ప్రతిష్టించబడింది. ఈ దిమ్మెపై తూర్పు ముఖాన శంఖచక్రాలు ఉత్తర పశ్చిమ, దక్షిణ ముఖాలపై కీర్తి ముఖాలు ఉన్నాయి. ఆలయ ప్రత్యేకత అంతా గర్భగుడిలోని మూర్తిలో ఉంది. నల్ల గ్రానైటు రాతితో చెక్కబడ్డ అరవై ఆరు అంగుళాల పొడవైన విగ్రహం ఇది. బాగా నున్నగా మెరుగు పెట్టిన కాంతివంతమైన మూర్తి పాంచరాత్రగమం ప్రకారం విష్ణుమూర్తి యొక్క చతుర్వింశతి వ్యూహాలలో ఇది కేశవమూర్తి. చతుర్భుజాలలో కుడిపై శంఖం, డమపై చేతిలో చక్రం, ఎడమ క్రింది చేతిలో గద, కుడి క్రింది చేతిలో పద్మమూ ఉన్నాయి. (చూడండి అనుబంధం) మూర్తికి ఇరు ప్రక్కలా చమర గ్రహిణులున్నారు. విగ్రహ పాదదేశానికి కుడి వైపున గరడుడు. ఎడమ వైపున ఆసీన స్థిలిలో నున్న లక్ష్మీదేవి చెక్కబడ్డారు. విగ్రహం వెనుకన చుట్టూ ఉన్న చట్రం పైభాగాన మరక తోరణం పైభాగాన వలయాల మధ్య వరుసగా, మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ,వామన, పరుశరామ, శ్రీరామ, బలరామ, బుద్ధ, కల్కిఅవతారాలు చెక్కబడి ఉన్నాయి. మూర్తి యొక్క శరీర భాగాలు ఇతర అలంకరణ, ఆయుధాలు మకర తోరణం గొప్ప పని తనంతో సున్నితంగా చెక్కబడ్డాయి. విగ్రహం బాగా సున్నితంగా ఉంటుంది. కాలి, చేతి వేళ్ళు మెరిసే గోళ్ల వివరాలు కూడా స్పష్టంగా కనబడతాయి. ఇంత వివరంగా అందంగా చెక్కబడ్డ మూర్తకీ, పెద్దగా అలంకరణ లేని సామన్యమైన దేవాలయానికి తేడా కొట్టవచ్చినట్టు కనబడుతాయి. బహుశ విగ్రహం బాగా ప్రాచీన కాలానికి చెందినదైనా తురుష్క దంద యాత్రల మూలంగా శిథిలమైన దేవాలయం తరువాత కాలంలో పునర్మించబడి ఉండవచ్చును. పైన పేర్కొన్న ఆధారల వల్ల కాకతీయుల కాలంలోనూ, ఆ తరువాత పదహారవ శతాబ్దం వరకూ ఆ ఆలయం వైభవ స్థితిలో ఉండేదనటానికి సందేహం లేదు. నేడు అంతగా ఆదరణ లేని ఈ దేవాలయం గురించి ఇంకా ఎంతో పరిశోధించవలసి ఉంది. ఆధారాలనే కాకుండా స్థానిక మౌఖిక సాహిత్యాన్ని ఆధారంగా తీసుకొని పరిశోధించవలసి ఉంది.

కొలనుపాక కుమారస్వామి, వరంగల్.