వారెవ్వా.. పుష్ఫరాజ్ ప్లాన్ అట్టర్ ప్లాప్
- సినిమా లెవెలెల్లో గంజాయి స్మగ్లింగ్
- గంజాయి స్మగ్లర్ అరెస్ట్
- భారీగా పట్టుబడిన గంజాయి
- యాంటీ డ్రగ్స్ వరంగల్ విభాగం పోలీసుల చొరవ
- రూ.85 లక్షల విలువ గల 338 కిలోల గంజాయి, ట్రాక్టర్ పోలీసులు స్వాధీనం
- పోలీస్ సిబ్బందిని ప్రశంసించిన సిపి అంబర్ కిషోర్ ఝా
వాయిస్ ఆఫ్ భారత్ , క్రైం న్యూస్ : అల్లు అర్జున్ నటించిన పుష్ఫ సినిమా దేశవ్యాప్తంగా ఎంత హిట్ అయిందో మనందరికి తెలిసిందే.. అందులో ఎర్ర చెందనం చెక్కల అక్రమ రవాణా ఎలా చేయవచ్చో.. అటవీ అధికారుల కళ్లు గప్పి స్మగ్లింగ్ ఎలా చేయాలో తెలివిగా పోలీసులను ఎలా బురిడీ కొట్టించవచ్చో చాల చక్కగా చూపించారు. బహుషా ఆ సీనిమాను స్పూర్తగా తీసుకున్నట్టున్నారు ఈ గంజా అక్రమ రవాణా దారులు. అచ్చంగా అదే సినిమాలో చూపించిన విధంగా ట్రాక్టర్ ను ఉపంయోగించి గంజాయి ప్యాకెట్టు స్మగ్లింగ్ చేయడానికి అనువుగా మార్చుకోవడం ఆశ్చార్యాన్ని కలిగించే విషయం. తాజాగా ఓ గంజాయి ముఠా పోలీసులకు పట్టు బడ్డారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఒక గంజాయి స్మగ్లర్లను హసన్ పర్తి, తెలంగాణ యాంటీ డ్రగ్స్ వరంగల్ విభాగం పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్టు చేశారు. వీరి నుంచి పోలీసులు సుమారు రూ.85 లక్షల విలువ గల 338 కిలోల గంజాయితో పాటు గంజాయిని తరలిస్తున్న ట్రాక్టర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ అరెస్టు కు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వివరాలను వెల్లడిస్తూ పోలీసులు అరెస్టు చేసిన నిందితుడు కిలో లక్ష్మీనారాయణ (24), పాతకోట, వైరామవరం మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మరో నిందితుడు అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన కిలో నారాయణ ఆదేశాల మేరకు నిందితుడు ఈ నెల 17న ఒడిషా రాష్ట్రం , చితరకొండ మండలంకు చెందిన నాటుగురు వద్ద మూడు వందల ముప్పై ఎనిమిది కిలోల గంజాయిని 96 ప్యాకేట్లుగా మార్చి, వాటి ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు ట్రాక్టర్ ట్రాలీ అడుగు భాగంలో రహస్యం ఒక డబ్బాను ఏర్పాటు చేసిన అందులో గంజాయి ప్యాకేట్లను భద్రపర్చి వాటిని ట్రాక్టర్ లో ధారకొండ నుంచి కామా రెడ్డి జిల్లా, బికనూర్ మండలం వద్దకు, భద్రాచలం, ములుగు, హనుమకొండ, సిద్దిపేట మీదుగా చెరవసే క్రమంలో పోలీసులకు అందిన సమాచారం నిన్నటి రోజున పోలీస్ అధికారుల ఆదేశాల మేరకు హసన్ పర్తి ఎస్ఐ దేవేందర్ రెడ్డి హసన్ పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో అనంతర సాగర్ క్రాస్ రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా వస్తున్న ట్రాక్టర్ ను పోలీసులు తనిఖీ చేయగా ట్రాలీ అడుగు భాగంలో రహస్యంగా ఏర్పాటు చేసిన డబ్బాలో గంజాయి ప్యాకెట్లను గుర్తించిన పోలీసులు గంజాయిని అక్రమ రవాణాకు పాల్పడుతున్న ట్రాక్టర్ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకోని విచారించగా నిందితుడు నేరాన్ని అంగీకరించాడు.
ప్రస్తుతం నిందితుడు, అతనితో పాటు గంజాయి తీసుకు రావాలని చెప్పిన వ్యక్తితో పాటు పలువు పరారీలో ఉన్నారు. గంజాయిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన తెలంగాణ యాంటీ డ్రగ్స్ వరంగల్ విభాగం ఏసీపీ సైదులు, కాజీపేట ఏసీపీ తిరుమల్ , తెలంగాణ యాంటీ డ్రగ్స్ వరంగల్ విభాగం ఇన్ స్పెక్టర్ సురేష్, హసన్ పర్తి ఇన్ స్పెక్టర్ చేరాలు, ఎస్ఐ దేవేందర్ రెడ్డి, రవితో పాటు ఇతర పోలీస్ సిబ్బందిని సీపీ అంబర్ కిషోర్ ఝా అభినందించారు. ఈ మీడియా సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, ఏసీపీలు దేవేందర్ రెడ్డి, నందిరాం నాయక్ పాల్గొన్నారు.

