కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లను,క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలీ : ఐఎఫ్టియు
సెప్టెంబర్ 19న ఖమ్మంలో ప్రాంతీయ సదస్సును బస్సుజయప్రదం చేయండి.
కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లను,క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలని, కాంటాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేసి కనీస వేతనం నెలకు 26వేల రూపాయలు ఇవ్వాలని,ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని,మోటార్ హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 19న రెండు ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో ఖమ్మంలో నిర్వహించే ప్రాంతీయ సదస్సుకు అన్ని రంగాల కార్మికులు హాజరై జయప్రదం చేయాలని ఐఎఫ్టియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష ,కార్యదర్శులు తోడేటి నాగేశ్వరరావుకు, కొక్కు సారంగపాణి పిలుపునిచ్చారు. శనివారం ఇల్లెందు ఐ ఎఫ్ టి యు కార్యాలయంలో జరిగిన ఏరియా కమిటీ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ఐఎఫ్టియు ఇల్లందు ఏరియా కమిటీ అధ్యక్షులు డి.మోహన్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏరియా కమిటీ కార్యదర్శి నరాటి వెంకటేశ్వర్లు, నాయకులు జటంగి వెంకన్న,తొగర సామెల్,ఆదెర్ల అంజయ్య, డి.నూనేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.
