ఓరుగల్లులో నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టు
- పోలీసుల అదుపులో ఎనిమిది మంది
- తహసీల్దార్ సంతకం పోర్జరీ
- నకిలీ రబ్బర్ స్టాంపుల తయారీ
- వివరాలు వెల్లడించిన ఏసీపీ నందిరాం నాయక్
వాయిస్ ఆఫ్ భారత్ (క్రైం న్యూస్) : తాజాగా గ్రేటర్ వరంగల్ లో తహసీల్దార్ సంతకాన్ని పొర్జరీ చేసి నకిలీ సర్టిఫికెట్లను విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టైంది. వరంగల్ ఎమ్మార్వో ఇక్బాల్ మట్ట్వాడ పోలీస్ స్టేషన్ లో చేసిన ఫిర్యాదు చేసిన విచరణలో నమమలేని నిజాలు తెలిసాయి. డబ్బులు ఇస్తే ఏ సర్టిఫికెట్ కావాలంటే దానిని క్షణాల్లో ఇస్తూ అందిన కాడికి దండుకున్నట్లు ఏసీపీ నందిరాం నాయక్ వెల్లడించారు. బుధవారం మట్టెవాడ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు తెలిపారు. నగరానికి చెందిన హస్తం సతీష్ తాను నిర్వహించే వడ్డీ వ్యాపార లైసెన్స్ రెన్యూవల్ కోసం వరంగల్ ఎమ్మార్వోను ఆశ్రయించారు. తన దరఖాస్తుతో పాటు పాట లైసెన్స్ కాపీని కూడా జత చేయడంతో వాటిని పరిశీలించిన తహసీల్దార్ ఇక్బాల్ అది తన సంతకం కాదని గుర్తించారు. సదరు లైసెన్స్ రెన్యూవల్ చేయకుండా హోల్డ్ లో ఉంచి మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి విచారణలో భాగంగా నేరస్థుడైన హస్తం సతీష్ ను అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే సదరు హస్తం సతీష్ కొంతకాలంగా వడ్డీ వ్యాపారం చేస్తూ తన వడ్డీ వ్యాపారానికి సంబంధించిన లైసెన్సు రెన్యూవల్ గురించి జూలూరి చక్రపాణిని ఆశ్రయించినట్లు వెల్లడించారు. అతను తహసీల్దార్ తో సంబంధం లేకుండా సర్టిఫికెట్ ఇప్పిస్తానని చెప్పి వరంగల్ కొత్తవాడకు చెందిన గోవిందు సతీష్ కుమార్ వద్దకు తీసుకెళ్లినట్లు వివరించారు.
ఈ విధంగా గోవిందు సతీష్ కుమార్ దగ్గరికి గత కొన్ని సంవత్సరాలుగా జూలూరు చక్రపాణి, మాన్యం సిద్ధయ్యలు కలిసి ఎవరినైనా తన దగ్గరికి తీసుకొని వస్తే, వారికి నకిలీ సర్టిఫికెట్ కావాలి అని అంటే తయారు చేసి ఇస్తున్నారని ఏసీపీ వెల్లడించారు. గతంలో గోవిందు సతీష్ మండి బజారుకు చెందిన కాజా మహమ్మద్ అజారుద్దీన్ అనే వ్యక్తికి కాజీపేట కు చెందిన సయ్యద్ సాబీర్ అనే వ్యక్తికి, మాకుల దామోదర్ అనే వ్యక్తికి ఎమ్మార్వో సంతకాలను ఫోర్జరీ చేసి ఫ్యామిలీ సర్టిఫికెట్లను ఇచ్చినట్లు విచారణలో తేలింది. ఎనమాములకు చెందిన కాసెట్టి కమలాకర్ కు, ఎనుమాముల వద్దగల సిరంగి రమేష్ కు ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్ల పట్టా పోవడంతో దానికి సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ల పట్టాను ఫోర్జరీ చేసి తయారు చేయించి ఇవ్వడంతోపాటు ఇంకా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులకు కూడా గత కొన్ని సంవత్సరములుగా గోవిందు సతీష్ కుమార్ ఫోర్జరీ చేసిన సర్టిఫికెట్లను ఎక్కువ డబ్బులకు అమ్ముకుంటున్నాడని వెల్లడించారు.
ఈ క్రమంలో ఎమ్మార్వో, వరంగల్ హస్తం సతీష్ పై కేసు నమోదు చేయగా, గోవిందుల సతీష్ కుమార్ దగ్గర సర్టిఫికెట్లు పొందిన పై వారందరూ కలిసి కేసు విషయమై మాట్లాడుకొనుటకు గోవిందు సతీష్ కుమార్ ఇంటి వద్దకు బుధవారం ఉదయం రాగా , పోలీసులు పట్టుకొని వారి నుంచి కాజీపేట తాసిల్దార్ పేరు మీద ఉన్న రబ్బర్ స్టాంపు ముద్ర, హనుమకొండ డిస్టిక్ అనే రబ్బర్ స్టాంప్ ముద్ర, వరంగల్ ఎమ్మార్వో కు సంబంధించిన రబ్బర్ స్టాంప్ ముద్ర, తాసిల్దార్ ఆఫీస్ కు సంబంధించిన రౌండ్ సీల్ లను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో సదరు గోవిందు సతీష్ ఇట్టి ఫోర్జరీ డాక్యుమెంట్లను తయారు చేయడానికి టైలర్ స్ట్రీట్ కు చెందిన సముద్రాల కిరణ్ కుమార్ అనే వ్యక్తి దగ్గర గత 15, 16 సంవత్సరముల క్రితం రబ్బరు స్టాంపులు తయారు చేయించి వాటిని ఉపయోగించి ఫోర్జరీ డాక్యుమెంట్లను తయారు చేస్తున్నాడని నందిరాం నాయక్ తెలిపారు.
ఆ తరువాత నకిలీ రబ్బరు స్టాంపులు తయారు చేసి గోవిందు సతీష్ కుమార్ కు ఇచ్చిన సముద్రాల కిరణ్ కుమార్ అనే వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. మొత్తంగా ఇట్టి నేరం చేయడంలో భాగస్వాములైన ఎనిమిది మంది నేరస్తులు పస్తం సతీష్, జూలూరి చక్రపాణి, గోవిందు సతీష్, మహమ్మద్ అజారుద్దీన్, సయ్యద్ సాబీర్, మాకుల దామోదర్, కాసెట్టి కమలాకర్, సముద్రాల కిరణ్ కుమార్ లను అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు. మాన్యం సిద్దయ్య మీద విచారణ కొనసాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ సబ్ డివిజన్ ఏసీపీ నందిరాం నాయక్ మట్టెవాడ సీఐ తుమ్మ గోపి ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు.
