టెట్ దరఖాస్తు ఫీజు’ను తగ్గించాలి

టెట్ దరఖాస్తు ఫీజు’ను తగ్గించాలి
  • నిరుద్యోగ అభ్యర్థులను ఆందోళనకు గురి చేయవద్దు
  • ఉచిత విద్యా , వైద్యం పకడ్బందీగా అమలు చేయాలి
  • తీన్మార్ మల్లన్న టీమ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు, ములుగు జిల్లా ఇంఛార్జీ అచ్చునూరి కిషన్

వాయిస్ ఆఫ్ భారత్ ( లోకల్ న్యూస్ ) :  ఉపాధ్యాయ అర్హత పరీక్ష “టెట్” దరఖాస్తు ఫీజు’ను ఒక్క పేపర్’కు రూపాయలు వెయ్యి, రెండు పేపర్లు వ్రాసే అభ్యర్థులకు రూపాయలు రెండు వేలుగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయించడం అంత్యత దారుణమని తీన్మార్ మల్లన్న టీమ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు, ములుగు జిల్లా ఇంఛార్జీ అచ్చునూరి కిషన్ అన్నారు. ములుగు జిల్లా కేంద్రం లో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.గతంలో ఒక్క పేపర్, రెండు పేపర్లు వ్రాసిన రూపాయలు 400 మాత్రమే ఉండేవి. ప్రస్తుతం ప్రభుత్వం పెంచిన ఫీజు ను చూసి అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.

అసలే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల నుంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగ యువత అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సొంత ఊళ్లో కి వెళ్ళాడానికి కూడా ఇష్టం లేక అవమానంతో పట్టణంలో ఒకపూట తిని, ఒకపూట పస్తులు ఉంటూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారని తెలిపారు. జోమోటో, స్విగ్గీ, పెట్రోల్ పంపులో , సూపర్ మార్కెట్లో, షాపింగ్ మాల్స్’లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం మేగా డిఎస్సీ ప్రకటించిన విషయం అందరికి తెలిసిందేనని అన్నారు.

దీనికి అర్హత’గా టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి ఏకంగా ఒక్క పేపర్’కు 1000 రూపాయలు, రెండు పేపర్లు వ్రాసే అభ్యర్థులకు 2000 రూపాయలను ప్రభుత్వం నిర్ణయించడం నిరుద్యోగ అభ్యర్థులను ఆందోళనకు గురి చేయడమేనని చెప్పకనేచెప్పవచ్చునని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీ లో భాగంగా ఉచిత పథకాలను అమలు చేస్తూ ఈ విధంగా నిరుద్యోగ అభ్యర్థుల నుంచి వేయ్యి ల రూపాయలు దండుకోవాలని చూడడం రాష్ట్ర ప్రభుత్వానికి సమంజసం కాదని అన్నారు.కావున తక్షణమే టెట్ దరఖాస్తు ఫీజు’ను తగ్గించి గతంలో ఉన్న ఫీజు’నే కొనసాగించాలని నిరుద్యోగ అభ్యర్థుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *