మానవతా దృక్పథంతో స్పందించిన బయ్యారం మండల ప్రజలు
- పోతురాజు మనిషా కుటుంబ సభ్యులకు 50 వేల రూపాయలు అందజేత
వాయిస్ ఆఫ్ భారత్ (లోకల్ న్యూస్): బయ్యారం ఎస్సీ కాలనీకి చెందిన పోతురాజు మనీషా గత కొంతకాలంగా “నరాల బలహీనత వ్యాధి” తో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ హాస్పటల్లో చికిత్స పొందుతుంది. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. కూలి చేసి బ్రతికే ఆ కుటుంబానికి మనిషాకు సరైన వైద్యం అందించే స్తోమత లేక వారి పరిస్థితి వర్ణణాతీతంగా మారింది… బయ్యారం మిత్రబృందం ఆధ్వర్యంలో మెసేజ్ పెట్టిన వెంటనే ఎంతోమంది బయ్యారం మండల ప్రజలు, పెద్దలు, దాతలు, మానవతవాదులు, నాయకులు, ప్రజాప్రతినిధులు,అధికారులు, వ్యాపారస్తులు, మానవతదృక్పథంతో స్పందించి పోతురాజు మనిషా నాగరాజు కుటుంబానికి సహాయ సహకారాలు అందించారు. బయ్యారం మిత్రబృందం వ్యవస్థాపకులు తుడుం రాజేష్ ఆధ్వర్యంలో గత కొంతకాలంగా హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న “పోతురాజు మనీషా” ను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొని బయ్యారం మండల ప్రజలు అందించినటువంటి ఆర్థిక సహాయాన్ని నిమ్స్ హాస్పిటల్లో వారి భర్త నాగరాజు కు రూ 50,000/- అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తుడుం వీరభద్రం, గంట శ్రీనివాస్, హెచ్చు రమేష్, సోమవరపు రవి, జినక లక్ష్మీనారాయణ,పోతురాజు రాజశేఖర్, బయ్యారం మిత్ర బృందం సభ్యులు కొమిరె జనార్ధన్, శెట్టి థామస్, మరికంటి నరేష్, శివ తదితరులు పాల్గొన్నారు.
