మాజీ మంత్రి రామిరెడ్డి వెంకట్ రెడ్డి 8వ వర్ధంతి

మాజీ మంత్రి రామిరెడ్డి వెంకట్ రెడ్డి  8వ వర్ధంతి

స్వర్గీయ మాజీ మంత్రివర్యులు  రామిరెడ్డి వెంకట్ రెడ్డి  8వ వర్ధంతిని పురస్కరించుకొని బయ్యారం మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద వెంకట రెడ్డి  చిత్రపటానికి పూలమాలవేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సొసైటీ అధ్యక్షులు మూల మధుకర్ రెడ్డి  మాట్లాడుతూ వెంకట్ రెడ్డికి   బయ్యారం మండలానికి ఎంతో సన్నితం ఉండేదని, ఏజెన్సీ ప్రాంతమైన బయ్యారం మండలాన్ని అభివృద్ధి చేయడంలో ఆరునిశలు కృషి చేశారని, ఈ ప్రాంతంలో ఏవైనా అభివృద్ధి పనులు కావాలంటే వెంకట రెడ్డి గారిని కలిస్తే కచ్చితంగా ఆ పనులు వెంటనే పూర్తి చేసేవారని కార్యకర్తలను ఎంతో అభిమానించే వారిని ఇలాంటి మహనీయుడు మనల్ని విడిచి ఎనిమిది సంవత్సరాలు అవుతున్న గాని వెంకట్ రెడ్డి పై కార్యకర్తలలో అభిమానులలో ఎంతో అభిమానం ఉందన్నారు .  ఈ కార్యక్రమంలో వేల్పుల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి భూక్య ప్రవీణ్ నాయక్,  స్థానిక ఎంపిటిసి తిరుమల శైలజ ప్రభాకర్ రెడ్డి, ఎంపీటీసీలు బానోత్ మోహన్ జి.   లక్ష్మి గణేష్, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు కొండపల్లి లక్ష్మీ , మండల నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు కార్యదర్శిలు స్థానిక ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *