సదరం ధ్రువీకరణ పత్రాలకు స్లాట్ బుక్ ప్రారంభం
- స్లాట్ బుకింగ్ కు ఈ నెల 3వ న చివరి తేది
- జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
వాయిస్ ఆఫ్ భారత్ (లోకల్ న్యూస్): సదరం ధ్రువీకరణ పత్రాలకు అర్హులైన వారు ఈ నెల 3వ తేదీలో స్లాట్ బుక్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు.స్లాట్ బుక్ చేసుకున్న దివ్యాంగులకు వైకల్య పరీక్షలను మార్చి 6, 20 తేదీలలో నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా 13, 27 తేదీలలో రెన్యువల్స్ కు స్లాట్ బుక్ చేసుకోవాలన్నారు కొత్తగా సదరం సర్టిఫికెట్ పొందవలసినవారు ముందుగా సమీపంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలలో డాక్టర్లచే వైకల్య నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలన్నారు.
