విధుల పట్ల అలసత్వం వహించకూడదు
విధుల పట్ల అలసత్వం వహించకూడదు
జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్
ప్రభుత్వ అధికారులు విధులు పట్ల అలసత్వం వహిస్తే క్షమించేది లేదని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ అన్నారు గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం వైద్యాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
అలాగే జగ్గుతండాలో ఉన్నటువంటి కస్తూరిబా పాఠశాలలో ఉన్నటువంటి సౌకర్యాలను చూశారు విద్యుత్ సౌకర్యం ,వాషింగ్ మిషన్లు లేదని Drinage సమస్య అలాగే ఉందని ఈ సందర్భంగా స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. తాను ఎప్పుడైనా కార్యాలయాలను తనిఖీ చేయవచ్చునని అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. స్థానిక తహసిల్దార్, ఎంపీడీవోలను అప్పుడప్పుడు ఇనిస్ట్యూట్ లను తనిఖీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి, డిపిఆర్ఓ, పంచాయతి కార్యదర్శులు పాల్గొన్నారు
