ప్రజల మనిషి భూపతి
- తెలంగాణ గాంధీగా ఖ్యాతి
- పేరుకు తగ్గట్టుగానే భూపతి అయినా, నిరాడంబర జీవితం..
- నేడు ఆయన 15న వర్ధంతి
నమ్మిన సిద్ధాంతం కోసం ఎన్నికల్లో వరుసగా పోటీ చేసి ఆస్తులు పోగొట్టుకున్నా.. ఆత్మవిశ్వాసం మాత్రం సడల లేదని బతికున్నంత వరకు చాటిని మహా మనిషి. తను పుట్టుకతో ధనికుడనని ఏనాడు గర్వపడలేదు, అలాగని బాధపడలేదు. మా తెలంగాణ మాకు కావాలంటూ నినదించారు. తన వెంట ఎంత మంది ఉన్నారన్నది కాదు, తను వేస్తున్న అడుగులు ఎటువైపు అనే కోణంలోనే ఆలోచిస్తూ మలిదశ తెలంగాణ పోరు కెరటమయ్యారు.తెలంగాణ కోసం జీవితాన్ని త్యాగం చేసిన ఆయనకు ఇప్పటికి సొంత ఇల్లు కూడా లేదు.
స్వాతంత్య్ర పోరాటంలో గాంధీజీతో కలిసి పనిచేసి జైలుకెళ్లారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పనిచేశారు. రజాకార్ల దురాఘాతలకు ఎదురొడ్డి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించి తన జీవిత కాలాన్ని వెచ్చించి నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచారు. తెలంగాణ ప్రజలతో గాంధీ అని పిలిపించుకున్నారు. మహాత్ముడు చూపిన బాటలో నడుస్తూ అందరికీ మార్గదర్శకుడిగా మారారు. 1946 ఆగస్టు 11న భూపతి జీవితం లో మరపురాని రోజు ఆరోజు మడూరి రాజలింగం కే సమ్మయ్య మరో మిత్రుడు తో కలిసి హయగ్రీవా చారి వెంట సైకిళ్లపై కిలా వరంగల్ కు చేరుకున్నారు భూపతి. తూర్పు కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం కోటలోని బత్తిని రామస్వామి ఇంట్లో హైగ్రీవా చారి తో కలిసి సమావేశమయ్యారు. ఇంతలో రజాకార్లు వారు ఉన్న ఇంటిని చుట్టుముట్టారు. అప్పుడు సాగిన పోరులో భక్తిని మొగిలయ్య అసువులు భాశారు. హైదరాబాద్ విమోచన ఉద్యమంలో భూపతి అజ్ఞాత జీవితం గడిపి పట్నానికి ముఖం మార్చి ఉద్యమానికి అంకితమయ్యారు.
1956లో హైదరాబాద్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఆవిర్భవించిన తర్వాత తమ రాష్ట్రం తమకే కావాలంటూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఆరంభమైంది. ఉద్యమానికి రాజకీయ పార్టీ అవసరమని భావించి 1968లో తెలంగాణ ప్రజా సమితి రూపకల్పన చేసిన వారిలో భూపతి ఒకరు. సత్యమేవ పాలకోవాలన్న మహాత్ముని మాటలు భూపతి మనసులో నాటుకుపోయాయి.
రాజకీయాలంటే రంగులు మార్చే క్రీడా కాదన్న విశ్వాసం భూపతిది. అందుకే అధికార పార్టీ ఆర్భాటాలకు ఈనాడు దగ్గర కాలేదు. ప్రజలకు దగ్గరగా ఉంటూ ప్రజా పోరాటాలకు పట్టుకొమ్మ గా నిలిచారు. తెలంగాణ ప్రజా సమితి, తెలంగాణ జన సభ, తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ, తెలంగాణ సంఘర్షణ సమితి, తెలంగాణ రాష్ట్ర సమితి, నవ తెలంగాణ పార్టీ, తెలంగాణ విద్యావంతుల వేదిక అన్ని సంస్థలకు భూపతి ఆప్తుడిగానే వెలిగారు ప్రత్యేక తెలంగాణ కావాలని 1996 నుంచి ఆరంభమైన మలిదశ ఉద్యమంలోనూ భూపతి తన ప్రస్థానాన్ని కొనసాగించారు తెలంగాణ ప్రజా సమితి జెండా భుజాన వేసుకుని తనతో కలిసి వచ్చే వారిని కలుపుకుని ఉద్యమంలోకి ఉరికారు. ప్రతి ఏడాది ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకలను నల్లజెండాలు ఎగురవేసి నిరూపించారు. మా తెలంగాణ మాకు కావాలంటూ నినదించారు. తన వెంట ఎంత మంది ఉన్నారన్నది కాదు తను వేస్తున్న అడుగులు ఎటువైపు అనే కోణంలోనే ఆలోచిస్తూ మలిదశ తెలంగాణ పోరు కెరటమయ్యారు.

పదవులకు వన్నె తెచ్చిన భూపతి..
భూపతి ఎన్నో పదవులను సమర్ధవంతంగా నిర్వహించినారు. అవార్డులు 1953 నుంచి 1985 వరకు వరంగల్ వ్యవసాయ మార్కెట్ సభ్యునిగా 1967లో వరంగల్ మున్సిపల్ కౌన్సిలర్గా 1944లో ఏవివి పాఠశాల 1967లో సికేఎం కళాశాల ఆసుపత్రి స్థాపనలో ప్రధాన భూమిక పోషించారు. 1972,-77 కాలంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం కార్యదర్శిగా 1970-74 మధ్యకాలంలో దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ సర్కిల్ సలహా మండలి సభ్యులుగా 1977లో జనతా పార్టీ విస్తరణ పార్టీ అధ్యక్షుడిగా 1978 శాసనసభ ఎన్నికల్లో ఓట్ల చీలికతో భూపతి ఓడారు. 1982-85 లో కాకతీయ యూనివర్సిటీ సెనేట్ సభ్యులుగా 1986లో షష్టిపూర్తి సందర్భంగా ప్రజాబంధు బిరుదును పొందారు. మలిదశ ఉద్యమం 2000 సంవత్సరం నుంచి ఉద్యమంలో అన్ని సంఘాలు సంస్థలతో కలిసి పని చేశారు. 2009 జనవరి 11న మహేశ్వరి గార్డెన్ లో తెలంగాణ గాంధీ అనే బిరుదు ప్రధానం చేశారు.
పేరుకు తగ్గట్టుగానే భూపతి అయినా, నిరాడంబర జీవితం..
భూపతి పుట్టింది వరంగల్ వారి అమ్మమ్మ బొల్లం లింగయ్య ఇంటిలో 1926 ఫిబ్రవరి 21న జన్మించారు. భూపతి తండ్రి తాతలు పుట్టింది పెరిగింది నాటి కరీంనగర్ జిల్లా ముల్కనూర్ అయినప్పటికీ వరంగల్ వ్యవసాయ మార్కెట్తో భూపతికి అవినాభావ సంబంధం ఉంది. తాతయ్య ప్రోత్సాహంతో మార్కెట్లో సొంతంగా ప్రతి వ్యాపారం నిర్వహించే భూపతి చాంబర్ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించారు. వీరి హయాంలోనే 18 నెలల పాటు అక్రమ వ్యాపారాలను సోషల్ కంట్రోల్ విధించి వ్యాపారంలోనూ నిజాయితీకి పెద్దపీట వేశారు. భూపతి నమ్మిన సిద్ధాంతం కోసం ఎన్నికల్లో వరుసగా పోటీ చేసి ఆస్తులు పోగొట్టుకున్న ఆత్మవిశ్వాసం మాత్రం సడల లేదని బతికున్నంత వరకు చాటారు. తను పుట్టుకతో ధనికుడనని ఏనాడు గర్వపడలేదు అలాగని బాధపడలేదు తెలంగాణ కోసం భూపతి జీవితాన్ని త్యాగం చేసిన ఆయనకు ఇప్పటికి సొంత ఇల్లు కూడా లేదు ఆయన కుటుంబాన్ని తెలంగాణ ప్రభుత్వమే ఆదుకోవాలని ఆశిద్దాం.

– కొలనుపాక కుమారస్వామి, వరంగల్
ఫోన్: 9963720669
