ఊరి సూరీళ్లు… సఫాయి కర్మచారులు

ఊరి సూరీళ్లు… సఫాయి కర్మచారులు
  • ఫిబ్రవరి 7 నుంచి 15 వరకు
    గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం సందర్భంగా

వాయిస్ అఫ్ భారత్ (తెలంగాణ న్యూస్):
2010 ఏప్రిల్ 24న నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ తొలిసారిగా పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ప్రారంభించారు. పంచాయతీరాజ్ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తే గ్రామ అభివృద్ధికి పాటుపడితే దేశంలో…… అభిప్రాయపడ్డారు. భారత రాజ్యాంగంలో 243వ అధికరణ స్ఫూర్తితో తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టం 2018 రూపొందించినది. ప్రతి గ్రామానికి ఒక పంచాయతీ కార్యదర్శిని నియమించి గతంలో ఎన్నడూ లేని విధంగా ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి షెడ్యూల్డ్ తెగలవారు సర్పంచులుగా పని చేసే అవకాశాన్ని కల్పించింది. రాష్ట్రంలో ఇప్పుడు 12770 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామానికి ఒక పంచాయతీ కార్యదర్శి ని ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ గ్రామాలు కేంద్రంగానే అమలు కావలసిన అవసరం ఉంది. అందుకే గ్రామపంచాయతీలను క్రియాశీలకంగా పనిచేసే వ్యవస్థలుగా రూపుదిద్దింది. కొత్త పంచాయతీ రాజ్ చట్టం ద్వారా గ్రామపంచాయతీలు అత్యంత కీలకంగా మారి సర్పంచులు ఉప సర్పంచులుగా వార్డు సభ్యులుగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు కథానాయకులుగా ఏ గ్రామానికి ఆ గ్రామం ప్రజల సంపూర్ణ భాగస్వామ్యం లో ప్రగతి పథాన నడవాలి. పచ్చదనం, మంచినీటి సరఫరా, లైటింగ్, పారిశుద్ధ్యం.

సఫాయి కర్మచారులు ఊరిని ఊర్లోని చెత్తను సాపు చేసేడి సఫాయిలు. వీళ్లు ఊరూ ఊరికి ఉంటారు. ఊరికి సూర్యులు వీళ్ళు. ఈగ ఊరు పెద్దదయ్యే కొద్ది వాళ్లు కూడా పెరుగుతారు. వీళ్లంతా ఎగిలిపరంగా లేసి ఊడ్చే పని మొదలు పెడతారు. చెత్తనంతా ఒక దగ్గర పోగుచేసి తీసుకుపోయి ఊరికి దూరంగా పోస్తారు. చిన్న చిన్న పల్లెలన్నీ నగరాలైతున్న సందర్భంలో సఫాయి కర్మచారుల్లో స్త్రీలు కూడా ఇల్లను వుడ్చే పనిలో జీవితకాలం అనుభవం ఉన్న ఈ తల్లులు ఊరుని ఊడుస్తాండ్రు. కొన్ని నగరాల రాత్రులు కూడా రోడ్లు శుభ్రం చేస్తుండ్రు. ఎందుకంటే రాత్రి పూటనే రోడ్లు ఖాళీగా ఉంటాయి కాబట్టి. అర్ధమ రాత్రి 11 గొట్టంగా ఊడ్చే పని మొదలుపెట్టి తెల్లారిందాక ఊడుస్తారు. ఎంత గొప్ప సేవ ఇది. కానీ ఊర్లనైతే చెత్తచెదారమే కాదు ఊర్ల కుక్కలు చచ్చిన పందిసచ్చిన అయికల్లి కంపు కొడుతున్న సరే సఫాయిలే తీసుకపోయి ఊరవతల పారేసి వాసన రాకుండా చేస్తారు. సఫైలు లేకుంటే ఊరంతా రోగాలు వస్తే ఈగలు దోమలు పెరుగుతాయి వీటన్నిటిని రాకుండా చేస్తున్నది మాత్రం సఫాయిలే.

అయితే ఈ వృత్తిని అనాదిగా దళితులే చేస్తున్నారు. బతుకమ్మ బోనాలు అశాంతి ఊరు పండుగ ఎప్పుడు సఫాయిలకు పని ఇంకెక్కువైతది. ఊరు స్వచ్ఛంగా అందంగా ఉన్నదంటే సఫాయిల చేతిగుణమే మరి. పరిశుభ్రతకు మరో పేరు సఫాయిలు. వారి గ్రామం గ్రామ సర్పంచ్లు పంచాయతీ పాలకవర్గం నిర్ణయం మీదనే వీళ్ళ జీతం ఆధారపడింది. అయితే కనీస వేతనాలు చట్టం ప్రకారం కూడా వీళ్లకు వేతనం ఉంటలేదు. వారికి ఇచ్చే వేతనం ఇంత ఉండాలని గ్రామ పంచాయతీకి ఎటువంటి నియమ నిబంధనలు ప్రభుత్వం నుంచి లేవు. వీళ్లను ప్రభుత్వం ఉద్యోగులుగా పరిగణించదు. గ్రామపంచాయతీలకు వచ్చే ఆదాయాన్ని బట్టి వీళ్లకు వేతనాలు ఇస్తారు. వీరికి నిర్ణీత సమయం లేదు. పని ఎక్కువ వేతనం తక్కువ ఉన్న స్వచ్ఛభారత్ సైనికులు వీరు. గ్రామపంచాయతీల ఆదాయం అధికంగా ఉన్నచోట పెంచుతారు కావచ్చు. అయితే ఎప్పుడైనా పర్మినెంట్ కాకపోతే అనే ఆశ వారిలో కనిపిస్తుంది. వారికి ఎక్కువగా అస్తమా దగ్గు దమ్ము లాంటి వ్యాధులు వస్తున్నాయి. పనికి సరిపోయే పోషకాహారం తీసుకునే శక్తి లేక శక్తిహీనంగా ఊరికి సేవ చేస్తున్నారు.

కొలనుపాక కుమారస్వామి, వరంగల్
ఫోన్: 9963720669

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *