బాలరాముడి సేవలో తరలించిన ప్రముఖులు

బాలరాముడి సేవలో తరలించిన ప్రముఖులు
  • చినజీయర్‌ సహా ప్రముఖుల అయోధ్యకు రాక
  • ఇదోక అద్భుత అనుభూతి అన్న పవన్‌ కళ్యాణ్‌


వాయిస్ ఆఫ్ భారత్ (నేషనల్ న్యూస్): అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా కొనసాగింది. ’జై శ్రీరామ్‌’ నినాదాలతో అక్కడి వీధులన్నీ మార్మోగాయి. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు రామమందిరం వద్దకు చేరుకుని స్వామిని దర్శించున్నారు. దేశ వ్యాప్తంగా కొన్ని కోట్ల హృదయాలు అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం కోసం ఎదురు చూశాయి. అలాంటి అద్భుత ఘట్టం సోమవారం ఆవిష్కృతమైంది. మధ్యాహ్నం 12:38 గంటలకు అభిజిత్‌ లగ్నంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలందరి తరఫున ప్రతినిధిగా నిలిచి ఈ మహత్తర కార్యంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. రామ్‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించేందుకు సినీ, రాజకీయ, పారిశ్రామిక వేత్తలు తరలివచ్చారు. 500 ఏళ్ల నాటి కల సాకారమైందంటూ హర్షం వ్యక్తం చేశారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్‌ స్వామి, రామ్‌దేవ్‌ బాబు తదితరులు హాజరయ్యారు. తెదేపా అధినేత చంద్రబాబు, ప్రముఖ సినీ, క్రీడా ప్రముఖులు రజనీకాంత్‌, చిరంజీవి, రామ్‌చరణ్‌, పీటీ ఉష, అమితాబ్‌బచ్చన్‌, అనిల్‌కుంబ్లే, జాకీ ష్రాఫ్‌, రామ్‌దేవ్‌ బాబా తదితరులు వచ్చారు. ఇదొక అత్యద్భుతమైన అనుభవం. దేశ ప్రజలు గర్వపడే రోజు ఇదని నటుడు చిరంజీవి అన్నారు. విశ్వాసం, పవిత్రత నడుమ అయోధ్యలోని రామ మందిరాన్ని ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించారు. ఐక్యత, ఆధ్యాత్మికతకు ఇది చిహ్నంగా నిలుస్తుంది. ఇదొక చారిత్రక ఘట్టం. దీనికి సాక్షిగా నిలిచినందుకు గర్వంగా ఉందని మహేశ్‌బాబు అన్నారు. రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ చారిత్రక ఘట్టం. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. సుందరమైన ఈ దేవాలయాన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా సందర్శించాలని నటుడు ఆయుష్మాన్‌ ఖురానా అన్నారు. శ్రీరాముడి ఆశీస్సులు తీసుకునేందుకు వచ్చాను. అద్భుతమైన అనుభూతి కలిగింది. జీవితంలో ఒకసారి మాత్రమే ఇలాంటి అవకాశం వస్తుంది. దేశ ప్రజలు గర్వపడాల్సిన క్షణాలివని నటుడు రామ్‌చరణ్‌ అన్నారు. శ్రీరాముడు నన్ను భావోద్వేగానికి గురి చేశారు. ఆయన స్వరూపం ముగ్ధమనోహరంగా ఉంది. రామ్‌లల్లాను చూస్తే స్వామివారే స్వయంగా ఇక్కడ కొలువుదీరినట్లు ఉంది. దేశ ప్రజలందరూ బాగుండాలని కోరుకున్నానని బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ అన్నారు. జనసేన అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్‌ కళ్యాణ్‌ కూడా బాల రాముని సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొన్ని కీలక విషయాలు వెల్లడిరచారు. ఈ రోజు నాకు చాలా భావోద్వేగంగా ఉంది. ప్రాణ ప్రతిష్ఠ సమయంలో నా కళ్ళ నుంచి కన్నీళ్లు కారాయి. ఈ అద్భుతమైన మహోత్సవం భారతదేశాన్ని ఒకే జాతిగా బలోపేతం చేసింది. కార్యక్రమం అనంతరం పవన్‌కల్యాణ్‌ విూడియాతో మాట్లాడుతూ..ఇది నాకెంతో ఉద్వేగభరితమైన రోజు. ప్రాణప్రతిష్ఠ సమయంలో తెలియకుండానే కన్నీళ్లు వచ్చేశాయి. ఎన్నో ఏళ్ల కల నెరవేరిన క్షణాలివి. ఇది భారత్‌ను మరింత ఏకం చేస్తుంది. రానున్న రోజుల్లో ఇక్కడికి వచ్చేవారి సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నా. అయోధ్య కోసం ఏదైనా చేయాలని ఉంది. భవిష్యత్తులో ఆ దిశగా ప్రయత్నిస్తానని అన్నారు. శ్రీరామచంద్రుడు ధర్మం, సహనం, త్యాగం, ధైర్యసాహసాలకు ప్రతిరూపం. అందరికీ స్పూర్తిదాయకంగా నిలుస్తారు. శ్రీరాముని మార్గంలోనే భారత దేశం అనేక సవాళ్లను ఎదుర్కొంది. అయోధ్య రామాలయ నిర్మాణంలో మనందరం పాల్పంచుకోవడం సవిూష్టి బాధ్యత‘ అని పేర్కొన్నారు. అయోధ్య బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ
మహోత్సవానికి ప్రత్యేక విమానంలో లక్నో వెళ్లి.. అక్కడి నుంచి అయోధ్య బాల రాముని సన్నిధికి చేరుకున్నారు పవన్‌. గతంలో అయోధ్య ఆలయానికి రూ. 30లక్షలు విరాళం ప్రకటించారు. 500 ఏళ్ళ నాటి కల సాకారమవుతున్న వేళ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారన్నారు. దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *