మీ సెల్ ఫోన్ పోయిందా ఇలా చేయండి
వాయిస్ ఆఫ్ భారత్ (వెబ్ న్యూస్):అనుకోని పరిస్థితులలో కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఫోన్ ని పోగొట్టుకుంటాం, అలాంటి సందర్భంలో మనం పోగొట్టుకున్న సెల్ ఫోన్ ను తిరిగి పొందాలంటే ప్రభుత్వ పరంగా సహకారం అందాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.
👉 కేంద్ర టెలికాం ముత్రిత్వ శాఖ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ప్రవేశపెట్టింది. మొబైల్ పోగొట్టున్న, చోరీకి గురైన వారు www.ceir.gov.in వెబ్సైట్లో లాగిన్ కావాలి.
👉 ఇందులో రిక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ లాస్ట్/స్టో లెన్ మొబైల్ లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
👉 సెల్ ఫోన్ నంబర్, ఐఎంఈఐ నంబర్, కంపెనీ పేరు, మెడల్, ఫోన్ కొన్నప్పుడు ఇచ్చిన బిల్లు అప్లోడ్ చేయాలి.
👉 మొబైల్ పోగొట్టుకున్న డేట్, టైమ్, స్టేట్, డిస్ట్రిక్, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వివరాలు ఎంటర్ చేయాలి.
👉 ఫోన్ కొన్న వ్యక్తి పేరు, అడ్రస్, ఐడీకార్డు, ఈమెయిల్ ఐడీ, ఓటీపీ కోసం మరో ఫోన్ నంబర్ ఎంటర్ చేయాలి.
👉 ఇదంతా ప్రాసెస్ పూర్తి చేశాక ఒక ఐడీ నంబర్ వస్తుంది. దీంతోనే ఫోన్ స్టేటస్ తెలుసుకునే అవకాశం ఉంటుంది.
👉 సెల్ ఫోన్ ఏ కంపెనీది అయినా సరే సీఈఐఆర్ విధానంతో ఫోన్ బ్లాక్, అన్బాక్ చేసే అవకాశం ఉంటుంది.
