పుష్ప- 2 కూడా వేరే లెవల్ లో ఉంటుంది.

పుష్ప- 2 కూడా వేరే లెవల్ లో ఉంటుంది.
  • ఎక్కడా తగ్గేది లేదన్న రష్మిక]
  • వేరే లెవల్లో ఉంటుంది: హీరియన్‌ రష్మిక మందన్నా 

(వాయిస్ ఆఫ్ భారత్, సినిమా) ఇండియన్‌ మోస్ట్‌ అవైటెడ్‌ ప్రాజెక్ట్స్‌ లో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటిస్తున్న ’పుష్ప2’ కూడా ఒకటి. ఈ సినిమా కోసం వరల్డ్‌ వైడ్‌ సినీ లవర్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్‌ రష్మిక మందన్న అదిరిపోయే అప్డేట్‌ ఇచ్చింది. రష్మిక ’పుష్ప 2’ షూటింగ్‌ తో బిజీ అయ్యింది. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌, రష్మిక జంటగా నటించిన ’పుష్ప: ది రైజ్‌’ ఏ రేంజ్‌ లో హిట్‌ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ మూవీ సక్సెస్‌ అవ్వడంతో దానికి సీక్వెల్‌ గా రాబోతున్న ’పుష్ప 2’పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మూవీ టీం కూడా అందుకు తగ్గట్లే ఎª`లాన్‌ చేస్తున్నారు. సుమారు రూ.400 కోట్ల భారీ బడ్జెడెట్‌ తో మైత్రి మూవీ మేకర్స్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ హైదరాబాద్‌ లో జరుగుతోంది. రీసెంట్‌ గానే జాతర సాంగ్‌ ని షూట్‌ చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్‌ రష్మికలపై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది.ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ…పుష్ప2’ విషయంలో ప్రావిూస్‌ చేస్తున్నాను. ఇది చాలా పెద్ద సినిమా. విూ ఎంటర్‌టైన్మెంట్‌కు ఎలాంటి ఢోకా లేదు. విూ అంచనాలను రీచ్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాం. తాజాగా నేను పుష్ప 2లో ఓ సాంగ్‌ షూట్‌ ను కంప్లీట్‌ చేశాను. సాంగ్‌ ఎంతో అద్భుతంగా వచ్చింది. ఇది ముగింపులేని కథ. ఈ చిత్రం ఎంతో ఆనందాన్ని పంచుతుంది. మంచి సినిమాను అందించేందుకు డైరెక్టర్‌ సుకుమార్‌ సార్‌ ఎంతగానో కష్టపడుతున్నారు. పుష్ప2లో నాపాత్ర మరింత ఆకట్టుకునేలా ఉంటుంది.. అంటూ ఓ ఆంగ్ల విూడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడిరచింది. దీంతో రష్మిక ’పుష్ప 2’ గురించి చేసిన ఈ కామెంట్స్‌ సినిమాపై అంచనాలను నెక్ట్స్‌ లెవెల్‌ కి తీసుకెళ్లాయి. కాగా ’పుష్ప: ది రైజ్‌’ లో అల్లు అర్జున్‌ నటనకు గాను నేషనల్‌ అవార్డు రావడంతో ’పుష్ప 2’ మూవీని పాన్‌ వరల్డ్‌ లెవెల్లో రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. అన్ని ప్రాంతీయ భాషలతో పాటు చైనా, జపాన్‌, రష్యా వంటి దేశాల్లోనూ విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. రాక్‌ స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *