బస్సును ఢీకొట్టిన ఆయిల్ ట్యాంకర్
- 25 మందికి గాయాలు
- ఆయిల్ ట్యాంకర్ బస్సు ఢీ
(వాయిస్ ఆఫ్ భారత్, క్రైం న్యూస్) ఆత్మకూరు మండలం నీరుకుల్లా క్రాస్ రోడ్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ములుగు నుంచి హనుమకొండ వైపు వస్తున్న బస్సును ఎదురుగా వచ్చిన ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో పెను ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం దెబ్బతినగా ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 25 మందికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. వీరందరినీ 108 లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. క్షతగాత్రుల వివరాలను తెలుసుకొని సమాచారం అందించనున్నట్లు వెల్లడించారు.

