జాతరకు ఏర్పాట్లు సిద్దం
- ఐనవోలు జాతరకు అన్ని ఏర్పాట్లు
- కార్యనిర్వహాణాధికారి అద్దంకి నాగేశ్వర్ రావు
(వాయిస్ ఆఫ్ భారత్, కల్చరల్) సంక్రాంతి పర్వదినం నిర్వహించనున్న ఐనవోలు శ్రీ మల్లి కార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కార్యనిర్వహాణాధికారి అద్దంకి నాగేశ్వర్ రావు తెలిపారు. శుక్రవారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ ఈ నెల 13, 14, 15 తేదీల్లో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. 15న బండ్లు తిరిగే కార్యక్రమం ఉంటుందన్నారు. 16న చుట్టుపక్కల జనాలంతా విచ్చేసి స్వామి వారిని దర్శించుకోవడం అనావవాయితీగా జరుగుతోందన్నారు. 17న సంప్రక్షణ ఉంటుదని వివరించారు. మార్చిలో శివరాత్రి పర్వదినం సందర్భంగా మహా పెద్ద పట్నం ఉంటుందని, చివరి ఆదివారం మల్లన్న కళ్యాణంతో జాతర ఉత్సవాలు ముగుస్తాయన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకల సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. అంతే కాకుండా గత సంవత్సరం కంటే మెరుగ్గా శానిటేషన్, తాగునీటి వసతి, ఆరోగ్య శిభిరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అదే మాదిరిగా భక్తులకు ఆర్టీసీ నిరంతరం సేవలు అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. సాధారణ భక్తులకు, వృద్ధులకు, వీఐపీలకు ప్రత్యేక క్యూలైన్ లను ఏర్పాటు చేశామన్నారు. పోలీసులు తమవంతు సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. అందరూ జాతరను విజయవంతం చేయాలని కోరారు.
