28న పోపా పద్మశాలి ప్రతిభా పురస్కార్/Popa to be conferred with Padma Shri Pratibha Puraskar on 28th

28న పోపా పద్మశాలి ప్రతిభా పురస్కార్/Popa to be conferred with Padma Shri Pratibha Puraskar on 28th
###@@@!!Popa to be conferred with Padma Shri Pratibha Puraskar on 28th@@@!!!@@###

వాయిస్ ఆఫ్ భారత్, వరంగల్ (సెప్టెంబర్ 10) : పద్మశాలి ప్రతిభా పురస్కారాలను ఈ నెల 28న ఆదివారం నిర్వహించనున్నట్లు పురస్కార్ కన్వీనర్ గోషికొండ సుధాకర్ తెలిపారు. శివనగర్‌లోని పోపా కార్యాలయంలో బుధవారం పోపా రాష్ట్ర అధ్యక్షుడు శామంతుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీసీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర నాయకులు డాక్టర్ కూరపాటి రమేష్ మాట్లాడుతూ.. పద్మశాలి విద్యార్థులలో ప్రతిభావంతులకు పురస్కారాలు ఇవ్వడం వల్ల వారిలోని ప్రతిభ వెలికి తీసి ప్రోత్సహించడం గొప్ప విషయమని ప్రశంసించారు. పోపా జిల్లా అధ్యక్షుడు గుండు కామేశ్వర్ మాట్లాడుతూ.. పదవ తరగతి, ఇంటర్, నీట్, ఎంసెట్, జేఈఈ, ఐఐటీ తదితర పరీక్షలలో ఉత్తమ మార్కులు సాధించిన పద్మశాలి విద్యార్థులు ఈ నెల 20లోపు తమ ర్యాంక్ కార్డు, బయోడేటాలను కన్వీనర్ గోషికొండ సుధాకర్‌కు 93901 22559 నంబర్‌కు పంపగలరని తెలిపారు. ఈ పురస్కారంలో విద్యార్థులకు నగదు, ప్రశంసాపత్రం, మెమెంటో అందజేయబడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆడెపు శ్యామ్, 34వ డివిజన్ పద్మశాలి అధ్యక్షుడు కోడం ప్రతాప్, పెద్దురి పెద్దన్న, వొళ్ళలా రమేష్, కుడికాల సుధాకర్, మాటేటి అశోక్, సంతోష్, రాజగోవింద్, బైరీ శ్యామ్, మేరుగు సుభాష్, తుమ్మ రమేష్, గుండేటి సతీష్, చెన్నూరి రమేష్, వంగరి వేణు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *