రాహుల్ని ప్రధాని చేయ్యడమే కాంగ్రెస్ లక్ష్యం
రాహుల్ని ప్రధాని చేయ్యడమే కాంగ్రెస్ లక్ష్యం
పోరిక బలరాం నాయక్ గెలుపుకొరకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పనిచేయాల
వాయిస్ అప్ భారత్ (బయ్యారం లోకల్ న్యూస్)
మహబూబాబాద్ పార్లమెంట్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పోరిక బలరాం నాయక్ గెలుపుకొరకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పనిచేయాలని అదే విధంగా రాహుల్ని ప్రధానమంత్రి చేయడమే మనందరి లక్ష్యమని బయ్యారం మండల కాంగ్రెస్ అద్యక్షుడు కంబాల ముసలయ్య అన్నారు. గురువారం మండలంలోని ఉమ్మడి గౌరారం జిపిలో ర్పాటు చేసిన సమావేశంలో అయన మాట్లాడారు. మహబూబాబాద్ పార్లమెంటు ఎన్నికల ఇంచార్జి రాష్ట్ర మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు,ఇల్లందు శాసన సభ్యులు కోరం కనకయ్య ఆదేశం ప్రకారం మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మండలం లోనీ గౌరరాం, గురిమేళ్ల, వినోబానగర్ గౌరరాం ,కోడిపుంజు తండా ల ముఖ్యకార్యకర్తలతో సమావేశమై మాట్లాడారు. గడిసిన అసెంబ్లీ ఎన్నికలలో ప్రతీకార్యకర్త ఎంతో కష్టపడి పనిచేరన్నారు. ముఖ్యంగా ఇల్లందు నుండి కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్యకు 57వేల మెజార్టి తో గెలిపంచడం జరిగిందన్నారు. అభివృద్ధి లో వెనుక పడిన మన ప్రాంతాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ కార్యక్రమలనీ ప్రజల వద్దకు తీసుకవేళ్ళాలన్నారు. అభివృద్ధి లో ముందువరుసలో ఉంచాలి అంటే MLA తో పాటు ఎంపీ తోడు ఉంటే మనం కోరుకున్న అభివృద్ధినీ సాధ్యం చేసుకోచ్చన్నారు. మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ చేతి గుర్తు పైన ఓటు వేసేవిదంగా ఓటర్సలను కలిసి ఓటును అభ్యర్థిచాలని నాయకులను కార్యకర్తలను కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో బయ్యారం సొసైటీ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి ,మాజీ వైస్ ఎంపీపి,మాజీ మండల అధ్యక్షుడు సొసైటీ డైరెక్టర్ వేల్పుల శ్రీనివాస్ ,జిల్లా కార్యదర్శి ముల్కురి వీరరెడ్డి, బయ్యారం మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
