200 రోజుల పని దినాలు కల్పించాలి….

200 రోజుల పని దినాలు కల్పించాలి….
ఉపాధి హామీ

ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి వ్యక్తికి 200 రోజుల పని దినాలు కల్పించాలి….

సిఐటియు….. కేంద్రం బిజెపి ప్రభుత్వం కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16న జరుగుతున్న దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ సందర్భంగా బయ్యారం మండల కేంద్రంలోని ఉపాధి హామీ కార్మికులను CITU  మండల కన్వీనర్ వల్లాల వెంకన్న సంతకాల స్వీకరణ చేస్తూ సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. అనంతరం కార్మికులతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో కొద్దో గొప్ప ఉపాధి దొరుకుతుందంటే అది ప్రజాపోరాటాలతో పాటు పార్లమెంటులో వామపక్షాల కృషి వల్ల వచ్చిన ఉపాధి హామీ పథకం అని వారుగుర్తు చేశారు. ఈ పథకాన్ని కూడా బిజెపి ప్రభుత్వం ఎత్తివేయాలని కుట్రలు పన్నుతున్నది కూలీలకు జీవనాధారంగా ఉన్న ఈ పథకానికి బడ్జెట్ కూడా తగ్గించి ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం బిజెపి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని వారు విమర్శించారు. ప్రతి వ్యక్తికి 200 రోజుల పని దినాలు, రూపాయలు 600 రోజువారి వేతనం ఇవ్వాలని డిమాండ్ ను ఖాతరు చేయడం లేదని వారు విమర్శించారు. పెరిగిన ధరలను అరికట్టి, ఆహార మరియు నిత్యవసర వస్తువులపై జిఎస్టి ఉపసంహరించాలని ,పెట్రోల్ డీజిల్, కిరోసిన్ వంట గ్యాస్ పై కేంద్ర ఎక్సైజ్ సుఖాన్ని తగ్గించాలని వారు డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో రాము, రవి ,పద్మ కుమారి, జనార్ధన్ ,శ్రీకాంత్, లక్ష్మి ఉమారాణి, రజిత ,విజయ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *