హెల్మెట్ తో జాగ్రత్త, ఏమరపాటుగా ఉంటే ఇక అంతే !
వాయిస్ ఆఫ్ భారత్ (వెబ్ న్యూస్) సాధారణంగా ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త కోసం హెల్మెట్ ధరిస్తాం, కానీ ఆ హెల్మెట్ తోనే ప్రమాదం పొంచి ఉండవచ్చు జాగ్రత్త! ఎందుకంటారా ఇప్పుడు (సోషల్ మీడియాలో) వాట్సప్ లో తెగ వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.
అప్పుడప్పుడు బైకులలో ముందు సీటు బ్యాగులో నో, ఇంజన్ ప్రాంతంలోనూ పాములు దూరడం చూస్తుంటాం, తాజాగా ఒక పాము పిల్ల ఏకంగా హెల్మెట్లోకి దూరింది. ఇది గమనించిన ఒకతను హెల్మెట్ లోకి దూరిన పాము పిల్లను గుర్తించి దానిని వీడియో తీశాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. ఎందుకైనా మంచిది మీరు హెల్మెట్ ధరించేటప్పుడు ఒకసారి హెల్మెట్ లోపల కూడా జాగ్రత్తగా దులిపి ధరించండి. లేకుంటే ప్రమాదాలు పొంచి ఉండే అవకాశం ఉంది.
