స్వర్ణకారుడు కపిలవాయి గోపి చారి ప్రతిభ
- గోరంత సైజులో ఆయోధ్య రామాలయం నమూనా
వాయిస్ ఆఫ్ భారత్ (కల్చరల్ న్యూస్) : అయోధ్య రామాలయంలో మరో రెండు రోజుల్లో అంటే ఈ నెల 22న శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరుగనుంది. ఈ కార్యక్రమాన్ని అంగరంగవైభవంగా నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో జనం ఎవరికి తోచిన రీతిలో వారు తమ భక్తిని చాటుకుంటున్నారు. శ్రీరాముడి పేరు విూద ఓ టాటూ ఆర్టిస్ట్ భక్తులకు ఉచితంగా టాటూలు వేస్తున్నాడు. ఓ ట్రస్ట్ వాళ్లు రామయ్య కోసం 12 లక్షల మంది నేసిన ప్రత్యేక వస్త్రాలను శ్రీరామ తీర్ధ క్షేత్ర ట్రస్టు వారికి అందజేశారు. కొందరు లడ్డూలు చేసి పంపుతున్నారు. మరికొందరు రాముడు, సీత, అయోధ్య ఆలయ నమూనాలతో ఆభరణాలను తయారు చేసి భక్తిని చాటుకుంటున్నారు. తాజాగా తెలంగాణ నుంచి నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలానికి చెందిన స్వర్ణకారుడు కపిలవాయి గోపి చారి కూడా రామయ్యపై భక్తితో తన స్వర్ణ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. కేవలం 2.73 మిల్లిగ్రాముల బంగారంతో గోరంత సైజులో ఆయోధ్య రామాలయం నమూనాను రూపొందించాడు. గోపి చారి రూపొందించిన ఈ అయోధ్య నమూనా 1.5 సెంటీ విూటర్ల ఎత్తు, 1.75 సెంటీ విూటర్ల వెడల్పు, 2.75 సెంటీ విూటర్ల పొడవుతో ఉంది. ఈయన గతంలో కూడా బంగారంతో ªుట్వంటీ వరల్డ్‌కప్ నమూనాను తయారు చేశాడు. భవిష్యత్‌లో కూడా ఇలాంటి సూక్ష్మ నమూనాలను తయారు చేస్తానని చెబుతున్నాడు. గ్రామానికి చెందిన స్వర్ణకారులు
గోపిని సన్మానించారు.
