సంబురంగా సాహిత్యోత్సవం

సెయింట్ జోసెఫ్ పాఠశాలలో ఘనంగా వేడుకలు
హాజరైన సీపీ అంబర్ కిషోర్ ఝా, ఎమ్మెల్యే నాయిని
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
వాయిస్ ఆఫ్ భారత్, హనుమకొండ : స్థానిక కుమార పల్లిలోని సెయింట్ జోసెఫ్ ఉన్నత పాఠశాలలో 16వ సీఎస్ఏ సాహిత్య ఉత్సవ (లిటరరీ ఫెస్టివల్) కార్యక్రమాలు రెండు రోజలు పాటు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి 23న వరంగల్ పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ జా (ఐపీఎస్), 24న జరిగిన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్యఅతిథులుగా విచ్చేశారు. టి.ధనలక్ష్మి, బాసాని లత, రెవరెండ్ ఫాదర్ యన్.సురేందర్ తదితరులు పాల్గొన్నారు. వేడుకలకు అధ్యక్షత వహించిన రెవరెండ్ సిస్టర్ సుజాత (జనరల్ కౌన్సిలర్ ఇంచార్జ్డ్ ఫర్ ఎడ్యుకేషన్) మాట్లాడుతూ విద్యార్థులు ఈ పోటీ ప్రపంచంతో పాటు ముందుకు వెళ్లాలంటే నైపుణ్యాలు పెంపొందించుకోవడం ఎంతో అవసరమన్నారు. కాబట్టి, విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచన నైపుణ్యాలను పెంపొందిస్తూ భవిష్యత్తులో దేనినైనా ఎదిరించి నిలబడగలిగే ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతోనే ఈ పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనిలో భాగంగా సీఎస్ఏ విద్యాసంస్థలు విద్యార్ధుల అభివృద్ధికి అవసరమైన సదుపాయాలన్నీ కల్పించామని పేర్కొన్నారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ సాహిత్య వేడుకల్లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని 22 పాఠశాలల నుంచి సుమారు 864 మంది విద్యార్ధినీ విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం కన్వీనర్ గా విచ్చేసిన రెవరెండ్ సిస్టర్ మార్కెట్ (ప్రొవిన్షియల్ సుపీరియర్) ఈ కార్యక్రమంపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ప్రత్యేక అతిథిగా విచ్చేసిన పూర్వ విద్యార్థిని రావు పద్మ మాట్లాడుతూ నేడు తను ఇంత గొప్ప స్థాయిలో ఉండడానికి మిషనరీ విద్యాసంస్థల్లో నేర్చుకున్న క్రమశిక్షణ కారణమని తెలిపారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఈ పాఠశాలలు బాగా అభివృద్ధి చెందాయని, సెయింట్ జోసెఫ్ పాఠశాలలో విద్యను అభ్యసించిన విద్యార్థులు ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లోనే కాక మరెన్నో రంగాల్లో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారని తెలిపారు. అదేవిధంగా కార్యక్రమానికి రెవరెండ్ సిస్టర్ డా. బి. వేళాంగిణి (ప్రొవిన్షియల్ కౌన్సిలర్ ఫర్ ఎడ్యుకేషన్ ఇంచార్జ్), కరస్పాండెంట్ రెవరెండ్ సిస్టర్ బోయపాటి ఫాతిమా, ప్రధానోపాధ్యాయురాలు రెవరెండ్ సిస్టర్ మేరీ జయ ఆధ్వర్యంలో సాహిత్య ఉత్సవ వేడుకలను ఎంతో విజయవంతంగా నిర్వహించారు.

సాహిత్య పోటీల విజేతలు..
హనును కొండ కుమారపల్లి సెయింట్ జోసఫ్ పాఠశాలలో అంగరంగ వైభవంగా నిర్వహించిన ఎల్యుషన్, ఎస్సే రైటింగ్, క్విజ్
మాక్ పార్లమెంట్, డాక్యుమెంటరీ, స్పెల్ జీ, లైవ్ రిపేరింగ్ వంటి 12 విభాగాలలో జరిగిన పోటీలలో పాల్గోని మెరుగైన ప్రతిభను కనబరచిన
విద్యార్థిని విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ, ప్రోత్సాహక బహుమతులను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, స్థానిక
కార్పొరేటర్ పోతుల శ్రీమాన్ చేతుల మీదుగా ప్రదానం చేశారు.

సెయింట్ జోసఫ్ పాఠశాలకు 11 బహుమతులు..
ఆయా విభాగాలలో నిర్వహించిన పోటీలలో సెయింట్ జోసఫ్ విద్యార్థులు 11 బహుమతులను సాధించి వారి ప్రతిభను చాటుకున్నారు. ఈ పోటీలన్నింటిలో అత్యుత్తమ ప్రతిభను చాటుకున్న పాఠశాలకు చాంపియన్ షిప్ ట్రోఫీని ప్రొవిన్షియల్ సుపీరియర్ రెవరెండ్ సి సిస్టర్. మార్గట్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం సాహిత్య ఉత్సవ వేడుకలను ఎటువంటి ఆటంకం లేకుండా దిగ్విజయంగా
ముందుకు నడిపించిన సెయింట్ జోసఫ్ పాఠశాల యాజమాన్యం కరస్పాండెంట్ సిస్టర్ బోయపాటి ఫాతిమాను, ప్రిన్సిపల్ ‘సిస్టర్ మేరి జయకు, ఇతర సిస్టర్లకు, సెయింట్ జోసఫ్ పాఠశాల అధ్యాపక బృందానికీ (వికర్ జనరల్ ఆఫ్ కాటకి స్ట్ సిస్టర్స్ ఆఫ్ సెయింట్ ఆన్) పోతిరెడ్డి. ఆల్ఫోన్స్ అభినందనలు తెలియజేశారు.

