వైద్యం రాజగోపాల్‌కు నాపా ఆహ్వానం
వాయిస్ ఆఫ్ భారత్ , హనుమకొండ: సెప్టెంబర్ 20, 2025న వర్జీనియా రాష్ట్రంలో జరగనున్న నార్త్ అమెరికా ప్రవాస ఆంధ్ర అసోసియేషన్ (నాపా – NAPA) మహాసభలకు హాజరు కావాల్సిందిగా నాపా అధ్యక్షుడిగా ఎన్నికైన ప్రభాకర్ కొండా వైద్యం రాజగోపాల్‌ను ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు. ఈ మహాసభల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన రాజగోపాల్‌ను కోరారు.

